Advertisementt

అలియా గౌన్ అదిరిందమ్మా..

Tue 02nd May 2023 03:00 PM
alia bhatt,met gala outfit  అలియా గౌన్ అదిరిందమ్మా..
Alia Bhatt wore 1 lakh pearls to Met Gala 2023 అలియా గౌన్ అదిరిందమ్మా..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ క్యూటీ అలియా భట్ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి, పిల్లలు గత ఏడాది అలియా భట్ పర్సనల్ లైఫ్ లో పెద్ద సెన్సేషన్ అవ్వగా.. ఈ ఏడాది అటు కెరీర్ తన పాప రాహా యోగ క్షేమాలు, ఫిట్ నెస్ కోసం వర్కౌట్స్ అంటూ అలియా భట్ తెగ కష్టపడిపోతుంది. అలాగే బాలీవుడ్ లో జరిగే అవార్డు వేడుకలకి, ఫంక్షన్స్ కి గ్లామర్ గా హాజరవుతూ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది ఈ చిన్నది.

ప్రస్తుతం యుఎస్ లోని న్యూాయార్క్ పట్టణంలో జరుగుతున్న మెట్ గాలా 2023 లో అలియా భట్ అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. అలియా భట్ ముత్యాల గౌనులో కనిపించి మెస్మరైజ్ చేసింది. అలియా భట్ ధరించిన ఆ గౌను దాదాపుగా లక్ష ముత్యాలతో రూపొందించిన గౌన్ గా అలియానే రివీల్ చేసింది. సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎండ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు. దీన్ని ధరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ ట్వీట్ చేసింది.

మరో పక్కా ఇదే కార్యక్రమంలో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ తో కలిసి సందడి చెయ్యగా.. ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ సైతం నల్లటి గౌన్, ముత్యాలు, రాళ్లు పొదిగిన అంచతో మెరుస్తూ ఈ కార్యక్రమంలో స్పెషల్ గా కనిపించింది.

Alia Bhatt wore 1 lakh pearls to Met Gala 2023:

It took 1 lakh pearls to adorn Alia Bhatt Met Gala outfit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ