Advertisementt

NTR30: సైఫ్ కి వైఫ్ గా చైత్ర రాయ్

Tue 02nd May 2023 01:09 PM
chaithra rai,saif ali khan  NTR30: సైఫ్ కి వైఫ్ గా చైత్ర రాయ్
NTR30: Chaitra Rai as Saif wife NTR30: సైఫ్ కి వైఫ్ గా చైత్ర రాయ్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న #NTR30 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. పక్కా స్క్రిప్ట్ తో కొరటాల శివ #NTR30 చిత్రీకరణ చేపట్టారు. రీసెంట్ గానే ఎన్టీఆర్-విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ కాంబో యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీన్ కుస్తీ ఫైట్ అని తెలుస్తుంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నుండి ప్రేక్షకులు ఇంకా బయటికి రావడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ కుస్తీ ఫైట్ అనగానే ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

ఇప్పుడు #NTR30 లో బుల్లితెర నటి చైత్ర రాయ్ అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. కన్నడ నుండి వచ్చి తెలుగు సీరియల్స్ లో మెరుస్తున్న చైత్ర రాయ్ ప్రస్తుతం జీ తెలుగు ఛానల్ రాధకి నీవెరా ప్రాణం సీరియల్ లో నటిస్తుంది. ఇప్పుడు ఈ చైత్ర రాయ్ #NTR30 లో కనిపించబోతుంది అని.. అది కూడా సైఫ్ అలీ ఖాన్ వైఫ్ గా చైత్ర రాయ్ కనిపించనుందట. చైత్రా రాయ్ NTR 30 ఇప్ప‌టికే జరిగిన షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనడంతో ఆమె ఎగ్జైట్ అవుతుంది.

ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్ వంటి గొప్ప స్టార్స్‌ను సెట్స్‌లో చూడ‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. అంతటి గొప్ప స్టార్స్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌టం నా అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఇంకా ఆ ఫీల్ నుండి బయటికిరాలేక మేఘాల్లో తేలిపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం NTR 30 భారీ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్‌, చైత్రా రాయ్‌ల‌పై ఈ షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

NTR30: Chaitra Rai as Saif wife:

#NTR30: Chaithra Rai plays Saif Ali Khan Wife

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ