Advertisementt

ఆ హీరోయిన్ తో డేట్ కి వెళతా: అఖిల్

Tue 02nd May 2023 12:42 PM
akhil,pooja hegde  ఆ హీరోయిన్ తో డేట్ కి వెళతా: అఖిల్
Akhil goes on a date with that heroine ఆ హీరోయిన్ తో డేట్ కి వెళతా: అఖిల్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని ఏజెంట్ ప్లాప్ అయ్యాక ఇంతవరకు పబ్లిక్ లో కనిపించలేదు. కానీ ఏజెంట్ షూటింగ్ ముగించేసి ఏజెంట్ ప్రమోషన్స్ లో చాలానే కష్టపడ్డాడు. ఏజెంట్ ప్రమోషన్స్ కి తక్కువ సమయం ఉండడంతో అఖిల్ ఒక్కరోజు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అందులో భాగంగానే అఖిల్ బుల్లితెర షో సుమ అడ్డాకి హీరోయిన్ సాక్షి వైద్యతో హాజరయ్యాడు. సుమ మాటలకు కౌంటర్లు వేస్తూ అదుర్స్ అనిపించిన అఖిల్ ఈ షోలో చాలా విషయాలను రివీల్ చేసాడు.

రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని తన హార్ట్ బీట్ అన్నాడు అఖిల్, ఆ తర్వాత డేటింగ్ అవకాశం వస్తే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తావ్ అని అడగ్గానే టక్కున పూజ హెగ్డే పేరు చెప్పాడు. పూజ హెగ్డే తో డేటింగ్ కి వెళతాను అంటూ తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో రొమాన్స్ చేసిన అమ్మాయి పేరు చెప్పాడు. పూజ హెగ్డే తో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ కూడా అయ్యింది.

ఆ సినిమాలో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే తో డేటింగ్ కి వెళతానని ఆసక్తికర కామెంట్స్ చేసిన అఖిల్ నాగార్జునకి తెలియకుండా గోడలు దూకేవాడని అంటూ చెప్పిన సీక్రెట్స్ సుమ అడ్డా ప్రోమో వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ రేపు శనివారం రాత్రి 9.30 కి ఈటీవీలో ప్రసారం కానుంది. 

Akhil goes on a date with that heroine:

Akhil Akkineni Wants To Go Date With Pooja Hegde

Tags:   AKHIL, POOJA HEGDE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ