Advertisementt

ముంబై నుండి మహాబలేశ్వర్ కి OG గ్యాంగ్

Tue 02nd May 2023 11:44 AM
pawan kalyan,og  ముంబై నుండి మహాబలేశ్వర్ కి OG గ్యాంగ్
OG Gang from Mumbai to Mahabaleshwar ముంబై నుండి మహాబలేశ్వర్ కి OG గ్యాంగ్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ తో OG సెట్స్ మీదకి వెళ్లిపోయారు. గత పది రోజులుగా ముంబైలో పవన్ కళ్యాణ్ OG షూటింగ్ లో బిజీ అయ్యారు. ముంబై బ్యాగ్డ్రాప్ లో గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్ లో స్టైలిష్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. పవన్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ OG సెట్స్ లోకి వెళ్లిన రెండు రోజుల్లోనే ప్రియాంక షూట్ లో జాయిన్ అయ్యింది.

ప్రస్తుతం OG టీం తదుపరి షెడ్యూల్ కోసం ముంబై నుండి మహాబలేశ్వర్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ మూడు రోజుల పాటు జరుగుతుంది అని, పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ పై ఓ సాంగ్ చిత్రీకరణ చేపడతారని తెలుస్తుంది. OG ముంబై షెడ్యూల్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మహాబలేశ్వర్ షెడ్యూల్ తర్వాత హరి హర వీరమల్లు సెట్స్ లోకి వెళ్ళిపోతారని తెలుస్తుంది. అ తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ సెట్స్ ఇలా మూడు సినిమాల షూటింగ్స్ ఏకకాలంలో పూర్తి చేసేస్తారట.

OG Gang from Mumbai to Mahabaleshwar:

Pawan Kalyan OG shooting update

Tags:   PAWAN KALYAN, OG
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ