ప్రభాస్-ఓం రౌత్ కలయికలో భారీ లెవల్లో తెరకెక్కిన ఆదిపురుష్ రిలీజ్ కి డేట్ దగ్గరకొచ్చేస్తుంది. టీజర్ పై వచ్చిన నెగిటివిటీని పోగేట్టేందుకు మేకర్స్ చాలా కష్టపడుతున్నారు. నవమి రోజు వదిలిన పోస్టర్ వివాదాస్పదమైంది. రీసెంట్ గా సీత నవమి రోజు జానకిగా కృతి సనన్ లుక్ వదిలారు. కృతి సనన్ జానకి పాత్రలో ఒదిగిపోయింది. అయితే జూన్ 16 న విడుదల కాబోతున్న ఆదిపురుష్ నుండి ట్రైలర్ వదిలేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిపురుష్ ట్రైలర్ మే 9 న వదలాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మే 9 న ఆదిపురుష్ ట్రైలర్ ని కొన్ని థియేటర్స్ లో వదిలి.. తర్వాత యూట్యూబ్ ద్వారా పలు భాషల్లో ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఓం రౌత్ ఇప్పటికే పలు దేవాలయాలు తిరిగి ఆదిపురుష్ సక్సెస్ కోసం వేడుకుంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ప్రభాస్ కూడా తాను చేస్తున్న షూటింగ్స్ కి కాస్త విరామం ఇచ్చి ఆదిపురుష్ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.
జూన్ 16 సినిమా విడుదల ఉంటే.. రెండు రోజుల ముందునుండే ఆదిపురుష్ ప్రీమియర్స్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచే ఎర్పాట్లని మేకర్స్ మొదలు పెట్టేసారు.