వారం వారం సినిమాలొస్తున్నాయి, వెళుతున్నాయి. అందులో హిట్ అయ్యేవి ఎన్నో.. ప్రేక్షకులు రిజక్ట్ చేసేవి ఎన్ని ఉంటున్నాయో చూస్తున్నాం. గత వారం అఖిల్ ఏజెంట్ ఘోరమైన డిసాస్టర్ కాగా.. తమిళ పొన్నియన్ సెల్వన్ మిక్స్డ్ రెస్పాన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంటే.. ఈ వారం మే 5 న తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా గోపీచంద్ vs అల్లరి నరేష్ అన్నట్టుగా బాక్సాఫీసు ఫైట్ జరగబోతుంది. వాటితో పాటుగా ఓటిటిల నుండి ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్ లు, సినిమాలు మే 5 న రాబోతున్నాయి.
థియేటర్స్ లో గోపీచంద్-జగపతి బాబు కాంబోలో శ్రీవాస్ తెరకెక్కించిన రామ బాణం విడుదలకు సిద్ధమైంది. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు మే 5 న రాబోతుంది. అలాగే నాంది తో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్-విజయ్ కనకమేడల ఉగ్రం కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఉగ్రం ప్రమోషన్స్ కూడా ఆసక్తికరంగానే సాగుతున్నాయి. కిడ్నాప్ వంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాలో నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకోనున్నాడు.
ఈ వారం ఏయే ఓటిటిల నుండి ఏయే సినిమాలు, వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయో చూసేద్దాం
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన సినిమా మీటర్. ఏప్రిల్ 7 శుక్రవారం విడుదలైన ఈ సినిమా మే 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ హీరో రణ్ బీర్, శ్రద్ధా కపూర్ జోడీ కట్టిన తు ఝూఠీ మే మక్కర్ నెట్ ఫ్లిక్స్ నుండి మే 5 నుండి స్ట్రీమింగ్ కి రాబోతుంది.
రెనర్వేషన్స్ మే 3 స్టార్ వార్స్ విజన్స్ , మే 5 (వెబ్ సిరీస్ సీజన్ 2) కరోనా పేపర్స్, మే 5 (మలయాళం మూవీ) సాస్ బహు ఔర్ ఫ్లెమింగో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి అందుబాటులోకి రానున్నాయి.