సూపర్ స్టార్ రజినీకాంత్ నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించడం నచ్చని వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్యెల్యేలు దండయాత్రకు దిగడమే కాదు.. సూపర్ స్టార్ లాంటి రజినీకాంత్ ని నోటికొచ్చిన కారు కూతలు కూసారు. మూడు రోజులు షూటింగ్స్, మూడు రోజులు హాస్పిటల్, నీకు సిగ్గు శరం లేదు, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడతావా అంటూ రజినీకాంత్ పై నోరు పారేసుకోవడం ఆయన ఫాన్స్ కి నచ్ఛలేదు. మరోపక్క రజినీకాంత్ కమ్మ అంటూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు.
రజినీకాంత్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో మండిపడ్డ రజినీకాంత్ అభిమానులు ఆయనకి ఆపాలజీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో రాద్ధాంతం, చేసారు. అపాలజీ ఫర్ సూపర్ స్టార్ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేసారు. ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు కూడా రజినికాంత్ కి జగన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన ట్వీట్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దానితో వైసిపీ నాయకులు రజినీకాంత్ సారి చెప్పాలంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. మేము సారి చెప్పం మీరే చెప్పాలంటూ వైసీపీ అభిమానులు, నాయకులు ఇంకా ఇంకా రజినీకాంత్ ని దుమారం రేపే మాటలతో రెచ్చగొడుతూనే ఉన్నారు. ఓ సినీ స్టార్ చంద్రబాబు గురించి నాలుగు ముక్కలు మాట్లాడగానే వైసిపి నాయకులు కుక్కల్లా రోడ్డెక్కారంటూ రజిని అభిమానులు వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.