బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి వింత కోరిక అంటూ సోషల్ మీడియాలో ఆయన కోరికని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ సరదాగా నవ్వుకుంటున్నారు. 50 ప్లస్ లోను పెళ్లి చేసుకోకుండా గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తున్న సల్మాన్ ఖాన్ తాజాగా పెళ్లి, పిల్లలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ కి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయో, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటింగ్ చేసాడో చెప్పడం కష్టమే, తాజాగా తన ప్రేమ కథలన్నీ తనతోనే సమాధి అవుతాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ని ఓ యాంకర్ మీ ప్రేమ కథలతో జీవిత చరిత్ర రాయాలని అనుకుంటున్నారా అని అడగగా.. తాను ఫ్రెండ్ షిప్ చేసి ప్రేమించిన తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరూ మంచివారేనని… కానీ వాళ్లతో బ్రేకప్‌ల విషయంలో తప్పు తన వైపే ఉండండతో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అంతేకాకుండా తనకి పిల్లలంటే చాలా ఇష్టమని, నేను పెళ్లి చేసుకుంటానో, లేదో తెలియదు. కానీ భార్య లేకుండా నాకు తండ్రి కావాలని ఉంది. ఇందుకు భారతీయ చట్టాలు అంగీకరించవు. కరణ్ జోహర్ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను పొందారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఈమధ్యన సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో.. అభద్రతతో జీవించడం కంటే భద్రత మధ్య జీవించడం ఉత్తమంగా అంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.