Advertisementt

దుబాయ్ లో మహేష్ విల్లా ?

Mon 01st May 2023 11:56 AM
mahesh babu   దుబాయ్ లో మహేష్ విల్లా ?
Mahesh Villa in Dubai? దుబాయ్ లో మహేష్ విల్లా ?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు తరుచూ వెకేషన్స్ అంటూ ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళుతూ ఉంటారు. రీసెంట్ గానే స్విజ్జర్లాండ్, పారిస్ ట్రిప్ వేసి వచ్చిన మహేష్ బాబు మళ్లీ రీసెంట్ గా భార్య నమ్రత, సితార, గౌతమ్ లతో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే మహేష్ బాబు ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు దుబాయ్ వెళుతూ ఉంటారు. ఆయన అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే మహేష్ బాబు దుబాయ్ లో ఓ ఖరీదైన విల్లా కొన్నారని ప్రచారం జరుగుతుంది. 

ఆయన దుబాయ్ లో ఇల్లు కొని తరచూ అక్కడికి ఫ్యామిలీతో వెళ్లి సేదతీరాలని అనుకుని.. భారీ మొత్తం చెల్లించి దుబాయ్ లో సకల సౌకర్యాలు ఉన్న విల్లా కోనుగోలు చేసారంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్. మహేష్ కూల్ గా సినిమా షూటింగ్స్ చేసుకుంటూ ఉంటే నమ్రత.. మహేష్ చేసే వ్యాపారాల వెనుక శక్తిలా పని చేస్తుంది. ఆయన షూటింగ్స్ తో బిజీగా ఉంటూ ఉండడంతో నమ్రతనే రెస్టారెంట్ వ్యాపారంతో పాటుగా మాల్టోప్లెక్స్  బిజినెస్ లెక్కలన్నీ చక్కబెడుతుంది అంటారు.

అలా మహేష్ వ్యాపారంలో ఇప్పుడు పలు ప్రధాన నగరాల్లో ఖరీదైన ఫ్లాట్స్ కొనాలని అనుకుంటున్నారని.. అందులో భాగంగానే దుబాయ్ లో విలాసవంతమైన విల్లా కొనుగోలు చేసారని అంటున్నారు. మహేష్ దుబాయ్ విల్లా గురించి నేషనల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. అయితే మహేష్ నిజంగానే దుబాయ్ లో లగ్జరీ ఇల్లు కొన్నారా.. లేదా ఇది కేవలం రూమరా అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయమే.

Mahesh Villa in Dubai?:

Mahesh Babu Expensive Villa In Dubai?

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ