Advertisementt

పవన్ ఉస్తాద్ పై ఫాన్స్ ఖుషి

Mon 01st May 2023 11:27 AM
ustaad bhagat singh  పవన్ ఉస్తాద్ పై ఫాన్స్ ఖుషి
Ustaad Bhagat Singh Music Sittings Begin పవన్ ఉస్తాద్ పై ఫాన్స్ ఖుషి
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ లైనప్ తోనే పవన్ ఫాన్స్ ఖుషిగా ఉన్నారు. ఆయన షూటింగ్స్ తో చేస్తున్న హడావిడికి ఫాన్స్ కి నిద్ర పట్టడం లేదు. ప్రతి సినిమా అప్ డేట్ అడక్కుండానే పవన్ ఫాన్స్ చెంతకు చేరుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్, OG షూట్స్ అప్ డేట్స్ ఇస్తూ మేకర్స్ ఫాన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి భారీ అప్ డేట్ వచ్చేసింది.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మరో మాస్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలవ్వడం విశేషం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. గబ్బర్ సింగ్ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో అరేయ్ సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. అలాగే వీడియోలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే గబ్బర్ సింగ్ ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించబోతున్నారని అర్థమవుతోంది.  ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Ustaad Bhagat Singh Music Sittings Begin :

Ustaad Bhagat Singh Music Sittings Begin with Blockbuster duo Harish Shankar and Devi Sri Prasad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ