టాలీవుడ్‌లోకి గ్లామర్ భామగా ఎంట్రీ ఇచ్చి అందాలు ఆరబోసినా.. నిధి అగర్వాల్‌కి బ్రేక్ ఇచ్చే సినిమా ఉన్నప్పటికీ ఆమె కెరీర్ అంతగా వెలిగిపోవడం లేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ ఎవరికి ఎంత హెల్ప్ అయ్యిందో కానీ.. నిధి అగర్వాల్ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితమవడంతో.. ఆమెని గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తప్ప నిధి చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ప్రభాస్‌తో రాజా డీలక్స్ లో నటిస్తుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే నిధి అగర్వాల్‌కి చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆమెని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
తమిళంలో నటించిన సినిమాలు కూడా నిధికి సక్సెస్ ఇవ్వలేదు. అయితే నటన విషయంలో పూర్తిగా తెలిసిన వారు ఎవరూ ఉండరు. నాకే కాదు చాలామందికి నటనలో మెళుకువలు పూర్తిగా తెలియదు. అందుకే ఓటిటిల్లో వెబ్ సీరీస్‌లు చూస్తూ నటనని ఇంకా ఇంకా నేర్చుకుంటున్నాను. ఇప్పటివరకు అందంగా కనిపించాలనే దానిపైనే ఫోకస్ చేశాను. అలానే గ్లామర్ పాత్రల్లో నటించాను. ఇకపై నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఒప్పుకుంటాను, అలాంటి సినిమాలే రావాలని ఆశిస్తాను. నా నటనను మెరుగులు దిద్దుకుంటున్నాను.
ఇకపై టాలెంటెడ్ డైరెక్టర్స్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తున్నాను అంటూ నిధి అగర్వాల్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.