Advertisementt

బాలీవుడ్ హీరోలా.. శ్రీకాంత్ అయ్యంగార్

Fri 12th May 2023 04:07 PM
shrikanth iyyangar,rare photo,30 years ago,actor  బాలీవుడ్ హీరోలా.. శ్రీకాంత్ అయ్యంగార్
Shrikanth Iyyangar 30 Years Ago Photo goes Viral బాలీవుడ్ హీరోలా.. శ్రీకాంత్ అయ్యంగార్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన, పొందుతోన్న నటులలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఆయనకు వేషం ఇస్తే.. ఆ వేషానికి, పాత్రకి పర్ఫెక్ట్ న్యాయం చేయగల నటుడాయన. అందుకే.. ఇప్పుడు ఇండస్ట్రీలో దర్శకులు శ్రీకాంత్ అయ్యంగార్ కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టిస్తున్నారు. అయితే ఈ నటుడు తాజాగా తన ట్విట్టర్‌లో ఓ ఫొటోని షేర్ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 

ఏంటా ఫొటో అని అనుకుంటున్నారా? శ్రీకాంత్ అయ్యంగార్ 30 సంవత్సరాల క్రితం మంచి వయసులో ఉన్న ఫొటో అది. ఈ ఫొటోలో ఆయన ఓ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. తన బేర్ బాడీని చూపిస్తూ ఓ క్రికెటర్‌ని కూడా తలపిస్తుండటం విశేషం. అలాగే ఈ ఫొటోలో అప్పటి రేర్ వస్తువులను కొన్నింటిని గుర్తించవచ్చు. ఈ ఫొటోని షేర్ చేసిన శ్రీకాంత్ అయ్యంగార్.. 30 సంవత్సరాల క్రితం ఫొటో. ఈ ఫొటోలో ఉన్నది నేనే అంటే ఎవరూ నమ్మలేరు అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ ఫొటోకి నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే.. అప్పుడు ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా మీరు బాలీవుడ్ హీరో అయ్యేవారు. బ్యాక్‌గ్రౌండ్ లేక ఆగిపోయారేమో.. లేదంటే మీరు హీరోగా చక్రం తిప్పుతుండేవారు. ఈ ఫొటో చూస్తుంటే షారుఖ్, అక్షయ్, సల్మాన్ ఖాన్ గుర్తొస్తున్నారు. హీరోగా ట్రై చేయలేదా కాకా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ కామెంట్స్‌తో ఈ ఫొటో ట్రెండ్ అవుతోంది.  

Shrikanth Iyyangar 30 Years Ago Photo goes Viral:

Shrikanth Iyyangar Shares His Rare Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ