Advertisementt

సోషల్ మీడియాలో ఫ్లాప్ మూవీ ట్రెండ్

Mon 01st May 2023 10:26 AM
ravi teja,ravanasura,amazon prime,social media,trending  సోషల్ మీడియాలో ఫ్లాప్ మూవీ ట్రెండ్
Ravi Teja Ravanasura Movie Trending in Social Media సోషల్ మీడియాలో ఫ్లాప్ మూవీ ట్రెండ్
Advertisement
Ads by CJ

రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన రావణాసుర సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షోకే ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు ప్రేక్షకులు. ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాల హిట్స్‌తో ఉన్న రవితేజకి రావణాసుర మీద ఉన్న హైప్‌తో థియేటర్స్‌లో ఈ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకున్నప్పటికీ.. నెగెటివ్ టాక్‌తో రెండో రోజుకే కలెక్షన్స్ పడిపోయాయి. 

దానితో రవితేజ కూడా సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. గత శుక్రవారం నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్రెండ్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంత అట్టర్ ప్లాప్ మూవీ ఓటిటిలోకి వచ్చాక సోషల్ మీడియాలో అంతలా ట్రెండ్ ఏమిట్రా అంటున్నారు. #Ravanasura హ్యాష్ టాగ్ పదే పదే ట్రేండింగ్ లోకి రావడంతో అమెజాన్ ప్రైమ్ లో దీనికి ఎక్కువ వ్యూస్ రావడం ఖాయమనిపిస్తుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఓటీటీలోకి వచ్చేసినా సోషల్ మీడియా ట్రేండింగ్ రావణాసుర ఓటిటికి హెల్ప్ చేసింది అంటున్నారు. నిజంగానే ప్లాప్ మూవీ సోషల్ మీడియాలో అలా ట్రెండ్ అవడం విశేషమే కదా!

Ravi Teja Ravanasura Movie Trending in Social Media:

Ravi Teja Ravanasura Movie Streaming Started in Amazon Prime OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ