Advertisementt

భర్తని తలుచుకుంటున్న సురేఖా వాణి

Mon 01st May 2023 10:23 AM
surekha vani,character artist,birthday,surekha vani husband  భర్తని తలుచుకుంటున్న సురేఖా వాణి
Surekha Vani Emotional Post on Her Husband భర్తని తలుచుకుంటున్న సురేఖా వాణి
Advertisement
Ads by CJ

సురేఖా వాణి సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకుంటూనే పర్సనల్ లైఫ్‌లో కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి బట్టలతో హంగామా చేస్తుంది. అందులోనూ ఆమె తన భర్త అనారోగ్యంతో చనిపోయాక మరీ రెచ్చిపోతుంది. ఫ్రెండ్స్ బర్త్‌డేలకి, కూతురు బర్త్‌డే కి రెచ్చిపోయి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఈమధ్యన సురేఖా వాణికి రెండో పెళ్లి చేస్తాను అంటూ ఆమె కూతురు సుప్రీత చెబుతుంది.

అయితే సరైన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ సురేఖా వాణి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా సురేఖా వాణి తన భర్తని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. నా కళ్ళలో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవనే బాధే ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, నీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. అది నాకు తెలుసు. నువ్వు నా బర్త్ డేకి ఎంతగా హడావిడి చేసేవాడివో ఇప్పటికి గుర్తుంటుంది.

నిన్ను నేను చాలా మిస్ అవుతున్నా.. లవ్ యు ఫర్ ఎవర్ అంటూ సురేఖా వాణి చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

Surekha Vani Emotional Post on Her Husband:

Surekha Vani Remembered Her Husband 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ