Advertisementt

జైలర్‌పై వైసీపీ ప్రతాపం

Sun 30th Apr 2023 06:46 PM
ysrcp,chandrababu,rajinikanth,jailer  జైలర్‌పై వైసీపీ ప్రతాపం
YSRCP Targets Jailer జైలర్‌పై వైసీపీ ప్రతాపం
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంధ్ర వెళ్లి అక్కడ చంద్రబాబుని పొగడడం వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. సూపర్ స్టార్ లాంటి వ్యక్తి చంద్రబాబుని ఆ విధంగా పొగడడం వైసీపీ బ్యాచ్‌కి సుతారము నచ్చలేదు. దానితో రజనికాంత్‌పై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నారు. ఎక్కడ రజినీకాంత్ మాటలు తెలుగు ప్రజల గుండెల్లో నాటుకుంటాయో.. చంద్రబాబుకి ఎక్కడ ప్లస్ అవుతుందో, ఆయన ముఖ్యమంత్రి అయిపోతారో అని మంత్రి రోజా, బూతుల మాజీ మంత్రి కొడాలి నాని, జోగి రమేష్ ఇంకా వైసీపీ బ్యాచ్ చాలామంది మీడియాలో కూర్చుని కారు కూతలు కూస్తున్నారు.

రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడడం ఇప్పుడు ఆయన జైలర్‌కి ముప్పుతెచ్చేలా వైసిపీ కదలికలు ఉన్నాయి. రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ మూవీ ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రజనీకాంత్‌కి తమిళంలోనే కాదు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వైసిపీ వాళ్ళు రాజకీయంగా జైలర్ సినిమాపై ప్రతాపం చూపించే విధంగా మాట్లాడుతున్నారు. 

రజనీకాంత్ రాజకీయనాయకుడు కాదు.. చంద్రబాబు ఫ్రెండ్, ఆయన మీదున్న అభిమానంతో మాట్లాడిన మాటలకూ వైసీపీ వాళ్ళు ఎంతలా కుళ్లిపోతున్నారో సోషల్ మీడియాని కదిలిస్తే అర్థమవుతుంది. మూడు రోజుల షూటింగ్, మూడు రోజుల హాస్పిటల్, సిగ్గు శరం లేదు.. ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి వైసిపీ వాళ్ళు వాళ్ళ పరువు వాళ్లే తీసుకుంటున్నారు.

YSRCP Targets Jailer:

YSRCP Leaders Blasts Rajinikanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ