Advertisementt

వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత

Sat 29th Apr 2023 11:03 PM
vanitha vijayakumar  వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
Vanitha VijayaKumar ex-husband passed away వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో వనితా విజయ్ కుమార్ అంటే తెలియని వారుండరు. ఆమె విజయ్ కుమార్ కుమర్తెగా కన్నా మూడు పెళ్లిళ్ల వ్యవహారంలోనూ, తల్లితండ్రులతో ఆస్తి కోసం గొడవలు పడే వ్యవహారంలోనూ ఎప్పుడు మీడియాలోనే కనిపిస్తుంది. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి పెద్ద సెన్సేషన్. ఆమె చీరలు మర్చినట్టుగా భర్తలను మార్చే రకమంటూ కోలీవుడ్ లో చాలా కథనాలు వచ్చాయి. అయితే వనితా విజయ్ కుమార్ పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. 

కానీ పీటర్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా వనితని పెళ్లి చేసుకోవడంతో అదో పెద్ద వివాదమైంది. తర్వాత వనిత విజయ్ కుమార్ పీటర్ తో 2020 లో తెగ తెంపులు చేసుకుంది. అతని ప్రవర్తన నచ్చక వనిత విడిపోవాలనుకుంది. అక్టోబర్ 2020 సంవత్సరంలో వారిరువురు విడాకులు తీసుకొన్నారు. తర్వాత వనిత యాక్టింగ్ లో హడావిడి చేస్తుంది. కానీ వనితకు విడాకులిచ్చినా పీటర్ తర్వాత మీడియాలో కనిపించలేదు. 

మద్యానికి మరింతగా బానిసై ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. ఈ మధ్యన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారు. దాంతో పీటర్ ని చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. పీటర్ చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. పీటర్ పాల్ మరణానికి తాగుడే కారణమని ఆయన స్నేహితులు  చెబుతున్నారు.

Vanitha VijayaKumar ex-husband passed away:

Vanitha Vijayakumar Third Husband Peter Paul Passes Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ