Advertisementt

రజినీకాంత్ పై కొడాలి నాని ఫైర్

Sat 29th Apr 2023 05:57 PM
kodali nani,rajinikanth  రజినీకాంత్ పై కొడాలి నాని ఫైర్
AP MLA Kodali Nani Fires On Super Star Rajinikanth రజినీకాంత్ పై కొడాలి నాని ఫైర్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ పై గుడివాడ ఎమ్యెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. రజినీకాంత్ నిన్న విజయవాడలో ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ లో పాల్గొని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ప్రశంశల వర్షం కురిపించారు. చంద్రబాబు విజనరీని పొగిడారు. ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆకాక్షించడం ఏపీలోని అధికార పక్షానికి నచ్ఛలేదు. ఇప్పటికే రోజా రజినీకాంత్ కి ఏపీ రాజకీయాలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యింది.

తాజాగా కొడాలి నాని సూపర్ స్టార్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు అని అన్నాడు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలెవరూ పట్టించుకోరని చురకలు అంటించారు. ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశారు.. ఇప్పుడేమి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. 

ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజనీకాంత్ చదువుతూ మరింత దిగజారుతున్నాడని నిప్పులు చెరిగారు. రజినీకాంత్ సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు.. అక్కడ రాజకీయాలపై మాట్లాడను అంటూనే ఆయనకేదో తెలిసినట్టుగా ఇష్టం వచ్చింది మాట్లాడాడు.. అంటూ నాని నోరు పారేసుకున్నాడు. అయితే కొడాలి నాని రజినీకాంత్ పై చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ ఫాన్స్ కొడాలిపై ఫైర్ అవుతున్నారు. 

AP MLA Kodali Nani Fires On Super Star Rajinikanth:

Kodali Nani Dubs Rajinikanth As Zero In AP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ