కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే సినిమాని తెరకెక్కించి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సురేందర్ రెడ్డి ఖాతాలో హిట్స్, ప్లాప్స్ ఉన్నాయి కానీ.. ఏజెంట్ అంత డిసాస్టర్ లేదనే చెప్పాలి. రవితేజతో చేసిన కిక్ 2 ని కూడా కొంతమంది ఆడియన్స్ ఇష్టపడ్డారు. కానీ ఏజెంట్ ని ఏరకంగాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అఖిల్ ఏజెంట్ లో లుక్స్ వైజ్ గా, యాక్షన్ సీక్వెన్స్ లో వర్క్ పరంగాను తన పని చేసుకుపోయాడు. కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వానికి అఖిల్ కి డిసాస్టర్ తగులుకుంది. అఖిల్ ని సురేందర్ రెడ్డి నిండా ముంచేశాడు అని అక్కినేని అభిమానులు ఘొల్లుమంటున్నారు. ప్రతి ఒక్కరూ సురేందర్ రెడ్డి మేకింగ్ ని వేలెత్తి చూపించేవాళ్లే. అఖిల్ ని ఒక్క మాటా అనడం లేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్, అతను ఎంచుకున్న టెక్నీకల్ టీమ్ ని తిడుతున్నారు.
ఏజెంట్ డిసాస్టర్ అఖిల్ ని ఏమి చెయ్యలేదు.. సురేందర్ రెడ్డి కెరీర్ కి అతి పెద్ద మచ్చలా మిగిలిపోయింది. అతని కెరీర్ కి ఏజెంట్ డ్యామేజ్ అంటుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏజెంట్ ప్లాప్ విషయంలో అన్ని రకాలుగా సురేందర్ రెడ్డే బాధ్యత వహించాలంటున్నారు. సురేందర్ రెడ్డికి డబ్బులు ఖర్చు పెట్టించడమే తెలుసు. సైరా తర్వాత తీరు మార్చుకోవాల్సింది పోయి.. ఏజెంట్ విషయంలో అతి పెద్ద తప్పు చేసాడు.
అఖిల్.. ఏజెంట్ విషయం మరిచిపోయి ఇంకోసారి క్రికెట్ ఆడాడంటే అతనిపై నెగిటివిటి, ఏజెంట్ మచ్చ పోతుంది. అనిల్ సుంకరకి ఏజెంట్ పోయినా భోళా శంకర్ ఒడ్డున పడేస్తుంది. కానీ సురేందర్ రెడ్డిని నమ్మి ఛాన్స్ ఇచ్చే హీరో దొరకలిగా.. ఏజెంట్ తో నష్టపోయేది 'అతనొక్కడే' అంటూ సురేందర్ రెడ్డి ఫస్ట్ మూవీతో కౌంటర్ వేస్తున్నారు.