Advertisementt

మహారాణిగా రష్మిక ?

Sat 29th Apr 2023 11:07 AM
rashmika mandanna,sambhaji bhosle biopic  మహారాణిగా రష్మిక ?
Rashmika as Maharani? మహారాణిగా రష్మిక ?
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న టైమ్ నడుస్తుంది. లక్కీ హీరోయిన్ గా పాన్ ఇండియా భాషల సినిమాలతో రష్మిక చేస్తున్న హడావిడికి మిగతా హీరోయిన్స్ కి నిద్ర కూడా పట్టదు. అంత బిజీ హీరోయిన్ గా రష్మిక చక్రం తిప్పడమే కాదు.. స్టేజ్ పై వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. ఏదోలా మీడియాలో ఉండేలా రష్మిక ప్లాన్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసే రష్మికకి బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ భోంస్లే జీవిత కథ ఆధారంగా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న మూవీలో ఛాన్స్ వచ్చింది అని తెలుస్తుంది.

హిందీలో యానిమల్ మూవీ అలాగే మరో ప్రాజెక్ట్ చేస్తున్న రశ్మికకి ఈ ఛాన్స్ వచ్చింది అనే టాక్ నడుస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్  శంభాజీ భోంస్లే పాత్ర పోషిస్తున్నారు. చావా టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నని శంభాజీ భార్య మహారాణి ఏసుబాయి పాత్ర కోసం ఎంపిక చేసారని అంటున్నారు. స్టోరీ, అలాగే తన పాత్ర నచ్చడంతో  రష్మిక ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడానికి రష్మిక ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోబోతుందట. రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని మహారాజు శంభాజీ యుద్ధం కోసం వెళ్ళినప్పుడు మహారాణిగా ఏసుబాయి ఎలాంటి నిర్ణయాలు, వ్యూహాలు రచించి రాజ్యాన్ని పాలించిందో అనేది హైలెట్ కానుంది అని సమాచారం. సో ఈ సినిమా ఓకె అయితే రష్మిక రేంజ్ మరింతగా పెరిగినట్టే.

Rashmika as Maharani?:

Rashmika in Sambhaji Bhosle biopic?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ