అక్కినేని అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కానీ ఆయనకి తగిలే దర్శకులు అఖిల్ కష్టానికి ప్రతి ఫలం అందించడంలో అడుగడుగునా విఫలమవుతున్నారు. అఖిల్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి అదో పెద్ద డిసాస్టర్ అవడం నాగార్జున కి తలకొట్టేసినట్టయ్యింది. రెండో సినిమా హలో. అది సో సో మెటీరియల్. ఇక మిస్టర్ మజ్ను ఓకె పర్వాలేదు. క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ ని లవర్ బాయ్ ని చేసినా ఆ హిట్ పూజ హెగ్డే ఖాతాలోకి వెళ్ళింది. ఇప్పుడు ఏజెంట్ గా వస్తే.. సురేందర్ రెడ్డి అఖిల్ కి ఘోరమైన డిసాస్టర్ అంటగట్టాడు.
నిన్న రిలీజ్ అయిన ఏజెంట్ కి పూర్ ఓపెనింగ్స్, డిసాస్టర్ టాక్, డిసాస్టర్ రివ్యూస్, డిసాస్టర్ పబ్లిక్ టాక్. ఇంకేముంది రెండో రోజుకే ఏజెంట్ పని అవుట్ అనేలా ఉంది. దీనికి కారణం అఖిల్ కాదు దర్శకుడు సురేందర్ రెడ్డి అతని టెక్నీకల్ టీమ్. ఏజెంట్ టెక్నీకల్ టీమ్ లో అన్ని మైనస్ లే. మ్యూజిక్ దగ్గరనుండి అన్నీ.. స్పెషల్ గా ఇదొక్కటే ఏజెంట్ కి మైనస్ అని చెప్పుకోవడానికి లేదు. అఖిల్ తన వంతు కష్టపడ్డాడు. అఖిల్ ఒక్కడే కష్టపడితే సరిపోదు.. అన్నీ బలంగా ఉంటేనే సినిమా ఆడేది. అయినప్పటికీ అఖిల్ ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు.
అఖిల్ డిసాస్టర్ తర్వాత నాగార్జున ఫ్లోలో రీ లంచ్ అనడమే ఇప్పుడు అఖిల్ పై ట్రోలింగ్ కి కారణం. ఏజెంట్ డిసాస్టర్ తరవాత అఖిల్ ఎన్నిసార్లు రీ లంచ్ అవుతావంటూ కామెడీ చేస్తున్నారు కొందరు. కానీ అఖిల్ అభిమానించే అభిమానులు, ఇంకా సాధారణ ప్రేక్షకులు కూడా అఖిల్ కి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అందులో అఖిల్ ఏజెంట్ ని వీక్షించిన ఓ సినీ లవర్.. ఇలా పోస్ట్ పెట్టాడు.
అఖిల్ చాలామంది హీరోలకంటే చాలా బెటర్..
చక్కని అందగాడు..
సూపర్ హీరో మెటీరియల్..
మంచి ఈజ్ వున్న నటుడు..
ప్లాపులు అతని తప్పు కాదు..
సినిమా సమిష్టి కృషి..
భవిష్యత్ వున్న కుర్రాడ్ని బదనాం చేయడం సమంజసం కాదు. ..
ఇండస్ట్రీలో ఎదగాలంటే ఆనపకాయంత విద్వత్తుంటే సరిపోదు...
ఆవగింజంత అదృష్టముండాలి...🙏🏼
కచ్చితంగా అఖిల్ మంచి హిట్ కొడతాడు.. 👍🏻
God bless you akhil.. 👍🏻👍🏻👍🏻
నేను సినిమా చూశా.. అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.