ఏజెంట్ విడుదల రోజు ఫైరింగ్ స్టార్ట్ అంటూ మేకర్స్ వైల్డ్ సాలా అంటూ చాలానే బిల్డప్ ఇచ్చారు. అఖిల్ ఏజెంట్ భారీ ప్రమోషన్స్ అనలేము కానీ.. హడావిడిగా షూటింగ్ ముగించి పదిరోజులుగా సో సో ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. సురేందర్ రెడ్డి అంటే హీరోలని చాలా స్టైలిష్ గా చూపిస్తాడు, మేకింగ్ లో స్టయిల్ ఉంటుంది అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి అఖిల్ ని నిండా ముంచేశాడు. ఏజెంట్ గా అఖిల్ లుక్, పెరఫార్మెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగిన పాయింట్ లేదు అంటే సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పబ్లిక్ అయితే అఖిల్ నువ్వెప్పుడు హిట్ కొడతావా అని ఎదురు చూస్తున్నాము, నీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాం.. కానీ నీకు హిట్ రావడం లేదు, ఏజెంట్ ఏంట్రా బాబు ఇలా ఉంది.. టార్చర్ అంటూ స్పందిస్తున్నారు.
అరిస్తేనే Wildness అంటే చాలా మంది హీరోలు చాలా సినిమాల్లో అరిచారు, సురేందర్ రెడ్డి చేతిలో అఖిల్ ని పెట్టడం కరెక్ట్ కాదు, కాంతారా లాంటి సినిమాలు చూసాక మావల్ల కాదు ఇలాంటి సినిమాలు చూడ్డడం, సురేందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా సినిమా చేసాడు. ఒక్క మమ్ముట్టి, అఖిల్ తప్ప మరో ఇతర కేరెక్టర్స్ ఇంప్రెస్స్ చెయ్యలేదు. భారీగా సినిమా తీసి ప్రొడ్యూసర్ కి చుక్కలు చూపించావ్, మీకో దండాలు, మీకు అన్నిన్ని డబ్బులు ఉంటే మాకెందుకు ఈ టెన్షన్ అంటూ వైల్డ్ గానే స్పందిస్తున్నారు. మంచి డైరెక్టర్ ని పట్టుకుని ఎలాగోలా కథ సెట్ చేసుకుని సినిమా చెయ్యి అఖిల్ బాబు. అఖిల్ బాబు నీకు హిట్ రావాలని మీ నాన్న గారు కోరుకోవడం ఏమోకానీ.. మేము కోరుకుంటున్నాం.
అఖిల్ బాబు రీ లాంచ్ అంటూ చెప్పడమే కానీ.. మళ్ళీ మళ్ళీ రీ లాంచ్ అవుతారా అంటూ కామెడీ చేస్తున్నారు. ఏజెంట్ రిజల్ట్ మొత్తం సురేందర్ రెడ్డి మెడకే చుట్టుకుంది. అఖిల్ కి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి, మిక్సింగ్, సౌండ్ లాంటి టెక్నికల్ సమస్యలు కూడా వున్నాయంటే ఏమనుకోవాలి.. అంటూ పబ్లిక్ ఏజెంట్ ని ఆడేసుకుంటున్నాడు.
అసలు ఏజెంట్ ఫైరింగ్ కాదు బాబోయ్ టార్చర్.. థియేటర్స్ లో ఉండలేకపోతున్నామంటూ పరుగులు పెడుతున్న ప్రేక్షకులని చూస్తే అయ్యో పాపం అఖిల్ బలైపోయాడు అనుకొకమానరు.