సూపర్ స్టార్ రజినీకాంత్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఈరోజు శుక్రవారం సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడలో జరుగుతున్న ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉదయం విజయవాడ ఎయిర్పోర్ట్ లో బాలకృష్ణ రజినీకాంత్ ని సాదరముగా ఆహ్వానించారు. తర్వాత సూపర్ స్టార్ చంద్రబా బు నాయుడు తేనీటి విందుకు హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు రజినీకి శాలువా కప్పి సత్కరించారు. ఇక సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
తాను ఈ వేదికపై రాజకీయాలు మట్లాడకూడదని అనుభవం చెప్పిన పాఠం కానీ ఇంత పెద్ద రాజకీయనాయకుడు చంద్రబాబు ఉండగా రాజకీయాలు మాట్లాడకపోవడం నాగరికం అనిపించుకోదు అంటూ రజినీ సరదాగా మట్లాడారు. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ క్రితమే పరిచయమని, మోహన్ బాబు ఆయన్ని పరిచయం చేసినప్పుడే పెద్ద రాజకీయనాయకుడు అవుతాడని చెప్పాడు. చంద్రబాబుకి జాతీయరాజకీయాలే కాదు.. ఆయనకి ప్రపంచ రాజకీయాలు తెలుసు.. అది నేను చెప్పేదికాదు, ఇండియాలోని ప్రతి పెద్ద పొలిటిషన్ చెబుతారు. ఆయన విజనీరికి ఉదాహరణ. 1997 లోనే చెప్పారు.. విజన్ 2020 గురించి. ఐటి ఎంతగా డెవెలప్ అవుతుంది. హైదరాబాద్ ని హై టెక్ సిటీగా మార్చి.. బిలిగేట్స్ లాంటి వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి తమ కంపెనీలని మొదలు పెట్టారు.
20 ఏళ్ల క్రితమే ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు. నేను జైలర్ షూటింగ్ కి హైదరాబాద్ కి వచ్చినప్పుడు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ నుండి వెళుతున్నాను, దాదాపు 22 ఏళ్ళ తర్వాత నైట్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించింది. హైదరాబాద్ ఇండియాలోనే అలా ఉంది. ఎకనామికల్ గా ఎంతగా డెవెలప్ చెందింది.. దానికి కారణం చంద్రబాబే.. అంటూ రజినీకాంత్ మాట్లాడిన మాటలతో అనుమోలు గార్డెన్స్ హోరెత్తిపోయింది.