ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor latest look: NTR fans shocked

ఇలా చూస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి కునుకురాదు

ఎన్టీఆర్ ప్రస్తుతం #NTR30 షూట్ లో కొరటాలతో కలిసి ఫిల్మ్ సిటీలో చాలా బిజీగా వున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా జాయిన్ అయిన #NTR30 ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. త్వరలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే బాలీవుడ్ అమ్మాయి, శ్రీదేవి కూతురు కావడం #NTR30 కి జాన్వీ కపూర్ ప్లస్ అవ్వుద్ది అని మేకర్స్ అనుకున్నా ఆమె విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ మధనపడుతున్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్ బోల్డ్ గా ఎక్స్పోజ్ అవుతుంది కానీ.. ట్రెడిషనల్ గా ఎక్కడా కనిపించడం లేదు.

బాలీవుడ్ లో ఏ ఈవెంట్ కి హాజరైనా జాన్వీ కపూర్ తన అందాలపై శ్రద్ద పెడుతుంది. అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. ఎమన్నా అంటే అవకాశాల కోసం ఇలా చేస్తున్నా అంటూ బోల్డ్ గానే సమాధానం చెబుతుంది. కానీ ఆమె అందాలు వెండితెర మీద చూపిస్తే క్రేజ్ ఉంటుంది కానీ.. ఇలా ఎడా పెడా ఆరబోస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫాన్స్ బాధ కూడా అదే.

#NTR30 కి జాన్వీ కపూర్ ప్లస్ అవుతుందా.. లేదంటే ఆమె వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందా అనేది అర్ధం కానీ అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నిన్న ముంబైలో జరిగిన ఫిల్మ్ ఫర్ అవార్డ్స్ వేడుకలో జాన్వీ కపూర్ మరోసారి బోల్డ్ గా తయారై షాకిచ్చింది. జాహ్నవి కపూర్ అందాలు చూస్తే యూత్ కి పిచ్చెక్కుతుంది. ఎన్టీఆర్ ఫాన్స్ కయితే కునుకురానివ్వడం లేదు. #NTR30 కి సైన్ చేసాక అయినా కుదురుగా ఉండాలి కదా జాన్వీ.. అంటూ మొత్తుకుంటున్నారు వారు.

Janhvi Kapoor latest glamour look

Janhvi Kapoor latest look: NTR fans shocked
janhvi kapoor