Advertisementt

నా 25 ఏళ్ళ కెరీర్ లో అతి పెద్ద జర్క్: రాజు

Fri 28th Apr 2023 03:56 PM
dil raju,shaakuntalam  నా 25 ఏళ్ళ కెరీర్ లో అతి పెద్ద జర్క్: రాజు
Biggest jerk in my 25 year career: Dil Raju నా 25 ఏళ్ళ కెరీర్ లో అతి పెద్ద జర్క్: రాజు
Advertisement

బలగంతో బ్రహ్మాండమైన హిట్ కొట్టి శకుంతలంతో పోగొట్టుక్కున దిల్ రాజు.. ఎంత పోగొట్టుకున్నారో అనేది చెప్పడం లేదు కానీ.. శాకుంతలం డిసాస్టర్ అయిన 15 రోజుల తర్వాత శాకుంతలం రిజల్ట్ పై ఓపెన్ అయ్యారు. సమంతని చూసి.. గుణశేఖర్ పై నమ్మకంతోనే శాకుంతలం సినిమాని రిలీజ్ చేసారు దిల్ రాజు. మరి దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు రాకపోవడమే.. సహజంగానే సమంతపై సింపతీ, దిల్ రాజుపై నమ్మకం రెండూ కలిసి శాకుంతలం కి భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు.

కానీ మూడు రోజుల ముందు నుండే దిల్ రాజు ఆధ్వర్యంలో వేసిన శాకుంతలం ప్రీమియర్స్ శాకుంతలం కొంప ముంచాయి. ఆ సినిమాకి వచ్చిన డివైడ్ టాక్ సమంత కెరీర్ లో దేనికి రాలేదు. అటు గుణ శేఖర్, ఇటు దిల్ రాజు ఇద్దరూ శాకుంతలంతో నష్టపోయారు. తాజాగా దిల్ రాజు శాకుంతలం డిసాస్టర్ పై పెదవి విప్పారు. సాధారణ ప్రేక్షకులుగా కొంతమందిని శాకుంతలం థియేటర్స్ కి పంపించి రివ్యూస్ తెప్పించేశాం. 

ఆ రివ్యూస్ తోనే మాకు విషయం అర్థమైపోయింది. మొదటి వీకెండ్ కే క్లోజ్ అయ్యింది. ఇక సోమవారం, మంగళవారానికి కలెక్షన్లు రాలేదంటే శాకుంతలం రిజల్ట్ ఏంటనేది గ్రహించాలి. ఆ తర్వాత కూడా మనం ఆడుతుంది అనే ఊహల్లో ఉండకూడదు. నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ శాకుంతలం అంటూ దిల్ రాజు శాకుంతలం డిసాస్టర్ పై స్పందించారు.

Biggest jerk in my 25 year career: Dil Raju:

Dil Raju: Shaakuntalam was a big jerk in my career

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement