బలగంతో భారీ హిట్ కొట్టిన జబర్దస్త్ కమెడియన్ వేణు ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో కమెడియన్ గా, హీరోలకి స్నేహితుడిగా టాలెంట్ చూపించిన వేణు జబర్దస్త్ లో కమెడియన్ గా స్క్రిప్ట్ రాసుకుని స్టేజ్ మీద టీమ్ లీడర్ గా సత్తా చాటి తర్వాత కొన్నాళ్ళు వేరే ఛానల్స్ లో కామెడీ చేసి ఫైనల్ గా దర్శకుడిగా దిల్ రాజు బ్యానర్ నుండి టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. బలగంతో బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు. ఇప్పుడు స్నేహితులతో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
జబర్దస్త్ స్టేజ్ పై టీమ్ లీడర్ గా, ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా అభిమానులని సంపాదించుకుని ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుధీర్, అలాగే జబర్దస్త్ స్టేజ్ పై రకరకాల గెటప్స్ తో గెటప్ శ్రీనుగా మారి ప్రస్తుతం వెండితెర మీద కేరెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న శ్రీనులతో బలగం వేణు వెకేషన్స్ కి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితమే ఫ్లైట్ ఫొటోతో వెకేషన్స్ గురించి చెప్పిన వీరు ప్రస్తుతం మంచులో ఎంజాయ్ చేస్తున్నారు.
వాళ్ళు ఎక్కడికి అంటే ఏ ప్రదేశానికి వెకేషన్స్ కి వెళ్లారో చెప్పకుండానే వారు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అనే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. సుధీర్, వేణు, శ్రీను ఉన్న పిక్ షేర్ చేస్తూ.. Zindagi Milegi naa Dobara..😊😊@sudheeranandbayana @iamgetupsrinu #explorepage #travel #vacation #friendship #memories అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు ఈ ముగ్గురూ.