ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలకి హద్దులు చెరిపేసి ఇండియన్ సినిమాగా ప్రతి భాషా చిత్రాన్ని అదిరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఏ భాషలో సినిమా తెరకెక్కినా పాన్ ఇండియా మార్కెట్ కోసం పలు భాషల్లో సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. అలా ఆయా భాషల ప్రేక్షకులని ఆకట్టుకుని తమ సినిమాలకి మర్కెట్ చేసుకుంటున్నారు. ప్రతి భాషలో ప్రత్యేక పీఆర్ ఏజెన్సీతో ప్రమోట్ చేయించుకుంటున్నారు. కానీ కోలీవుడ్ హీరో విశాల్ ఇప్పుడు టాలీవుడ్ ని లైట్ తీసుకున్నాడో లేదంటే టాలీవుడ్ మీడియా ఆయన్ని లైట్ తీసుకుందో కానీ.. ఆయన సినిమాలకి తెలుగు మీడియా ప్రమోషన్స్ కరువయ్యాయి.
విశాల్ నటించిన సినిమాలన్ని తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. కొన్నేళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విశాల్ కి తెలుగులో డిటెక్టీవ్, అభిమన్యుడు లాంటి సక్సెస్ తర్వాత ప్రేక్షాధారణ పెరిగింది. అయితే తన ప్రతి సినిమాని తెలుగులోనూ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడంలో ముందుండే విశాల్ ఇప్పుడు తెలుగు మీడియాని పట్టించుకోవడం లేదనే అనుమానాలు లేవనెత్తుతున్నారు.
కారణం ఆయన నటించిన మార్క్ ఆంటోని ప్రమోషన్స్ విషయంలో విశాల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి ట్వీట్స్ పడుతున్నాయి. కానీ తెలుగులో పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చెయ్యకపోవడం వలన విశాల్ మార్క్ ఆంటోని పై ట్వీట్ వేసినవారు, టీజర్ రివ్యూ ఇచ్చినవారు కనిపించడమే లేదు. అసలు తెలుగు మీడియాలో విశాల్ మార్క్ ఆంటోని మూవీపై ప్రత్యేక కథనాలు కానీ ప్రమోషన్స్ లేకుండానే నిన్న టీజర్ రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారు ఈ టీజర్ ని పట్టించుకున్నారు. లేదంటే లేదు.
మరి విశాల్ తెలుగులో పీఆర్ టీం ని పెట్టుకోకపోవడం వలనే ఆయన సినిమాని ఇక్కడి మీడియా లైట్ తీసుకుంది. విశాల్ పాన్ ఇండియాలో రిలీజ్ చేసే సినిమాని ఇలా లైట్ తీసుకోవడం అర్ధం కావడం లేదు.