ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Super star Rajinikanth arrived at Vijayawada

సూపర్ స్టార్ ని రిసీవ్ చేసుకున్న బాలయ్య

Super star Rajinikanth arrived at Vijayawada

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఈ రోజు విజయవాడలో అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధిగా హాజరవుతారని నందమూరి బాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణలు ముఖ్య అతిధులుగా హాజరుకానున్న ఈవెంట్ ఈ రోజు శుక్రవారం.. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో జరపతలపెట్టారు.

ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం పది గంటలకి చెన్నై నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ ఎయిర్ పోర్ట్ కి రాగా.. నందమూరి బాలకృష్ణ, T D జనార్దన్ సూపర్ స్టార్ కి సాదర స్వాగతం పలికారు. బాలకృష్ణ రజినీకాంత్ ని ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. బాలయ్య ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తల కోలాహలం నడుమ అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Rajinikanth welcomed by Balakrishna at Vijayawada airport

rajinikanth
balakrishna