Advertisementt

సాయి ధరమ్ పై నెగిటివిటి: దానిపై క్లారిటీ

Thu 27th Apr 2023 09:51 PM
sai dharam tej  సాయి ధరమ్ పై నెగిటివిటి: దానిపై క్లారిటీ
Negativity on Sai Dharam: Clarity on it సాయి ధరమ్ పై నెగిటివిటి: దానిపై క్లారిటీ
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో హిట్ కొట్టాడు. కానీ రోడ్ యాక్సిడెంట్ లో తనని కాపాడిన వ్యక్తికి ఎలాంటి సహాయం చెయ్యకుండానే చేశాను అని, మెగా ఫ్యామిలీనుండి మెగా సాయం అబ్దుల్ కి అందినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ లో జరిగిన ప్రచారానికి అబ్దుల్ తన జీవనోపాధి కోల్పోయిన విషయాన్ని అబ్దుల్ చెబుతూ సాయి ధర్మన్ తేజ్ తనకి ఎలాంటి సహాయం చెయ్యలేదు అంటూ అతనిపై అలిగేషన్ చేసాడు. విరూపాక్ష ప్రమోషన్స్ లో సాయి తేజ్ తనని కాపాడిన వ్యక్తికి డబ్బుచ్చి ఋణం తీర్చుకోవాలనుకోవడం లేదు, అతనికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా, మా టీం అతనికి అందుబాటులో ఉంటుంది అన్నాడు. కానీ అబ్దుల్ మరోలా మాట్లాడంతో సాయి తేజ్ పై నెగిటివిటి మొదలయ్యింది.

పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్, సోషల్ మీడియాలో అబ్దుల్ చెప్పినదే నిజమని అందరూ సాయి తేజ్ ని అపార్ధం చేసుకున్నారు. దానితో సాయి ధరమ్ తేజ్ వెంటనే రంగంలోకి దిగి తన ప్రాణాలు కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ కు ఎంతోకొంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. అబ్దుల్ కి తన టీం తో తన కాంటాక్ట్ డీటెయిల్స్ అందించామని, అబ్దుల్ కి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు. 

తనకి సాయం చేసిన వ్యక్తిని మరిచిపోయేంత కృతజ్ఞుణ్ణి కాదని, అబ్దుల్ తో నా మేనేజర్ శ్రవణ్ టచ్ లో ఉంటాడు, ఈ విషయమై ఇకపై ఎలాంటి వివరణ ఇవ్వను, ఇదే చివరి వివరణ అంటూ ఓ వీడియో క్లిప్ ని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. అందరి అనుమానాలు తీరిపోయాయి.

Negativity on Sai Dharam: Clarity on it:

Sai Dharam Tej Reaction To Abdul Allegations

Tags:   SAI DHARAM TEJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ