సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ధ్రువ సినిమా చేసాడు. ఆ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మైలు రాయి. అప్పటినుండే రామ్ చరణ్ స్టైలిష్ లుక్ ని, అతని యాక్టింగ్ ని చాలామంది సినీ లవర్స్ లైక్ చేసారు. రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ, సురేందర్ రెడ్డి మేకింగ్ స్టయిల్, BGM అన్నీ ఆడియన్స్ కిక్ ఇచ్చాయి. ఇప్పుడు అదే సురేందర్ రెడ్డితో అఖిల్ ఏజెంట్ అంటూ స్పై థ్రిల్లర్ చేసాడు. ఏజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ధ్రువని అఖిల్ వాడేసాడు.
రామ్ చరణ్ తో అఖిల్ కి మంచి స్నేహ సంబంధం ఉంది. ఇక ఏజెంట్ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ద్రువగా, అఖిల్ ఏజెంట్ గా మాట్లాడుతూ ఇంట్రెస్ట్ కలిగించిన వీడియోని మేకర్స్ విడుదల చేసారు. అఖిల్ కి ధ్రువలా కాల్ చేసిన రామ్ చరణ్ ఏజెంట్ ఎక్కడున్నావ్ అనగానే ఏజెంట్ గా అఖిల్ దగ్గరలోనే ఉన్నాను అన్నాడు. ఇక్కడ అందరూ నీ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నారు అన్నాడు చరణ్. అఫ్ కోర్స్ ఇది నా వైల్డెస్ట్ మిషన్ నేను రెడీ అన్నాడు అఖిల్. మరి లేటెందుకు అని చరణ్ అనగానే.. నీ కమాండ్ కోసమే సీనియర్ అన్నాడు అఖిల్. లెట్స్ బిగింగ్ ద వైల్డ్ రైడ్ అంటూ అఖిల్, చరణ్ చెప్పిన డైలాగ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
ధ్రువ బ్యాగ్ రౌండ్ స్కోర్ మరోసారి అద్భుతం చెయ్యగా.. అఖిల్ ఏజెంట్ లుక్, చరణ్ ధ్రువ గా ఇచ్చిన పెరఫార్మెన్స్ అన్నీ ఈ వీడియోతో ఏజెంట్ పై అంచనాలు పెంచేలా ఉన్నాయి.