Advertisementt

ఆక్సిజన్ మాస్క్ తో సమంత

Thu 27th Apr 2023 03:45 PM
samantha  ఆక్సిజన్ మాస్క్ తో సమంత
Samantha with oxygen mask ఆక్సిజన్ మాస్క్ తో సమంత
Advertisement
Ads by CJ

ఆక్సిజెన్ మాస్క్ లో సమంత అనగానే ఆమె అభిమానులు ఆందోళన పడిపోతారేమో.. అసలు విషయంలోకి వెళితే..

సమంత గత ఏడాది మాయోసైటిస్ తో బాధపడుతున్నట్లుగా ఆసుపత్రిలోసెలైన్ బాటిల్ పెట్టించుకుని చికిత్స తీసుకుంటున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత ఆరు నెలలకి మెల్లగా కోలుకుని ఈ ఏడాది తన పనిలో నిమగ్నమైంది. అయినప్పటికీ మాయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకోలేదు తాను థెరపీ చికిత్స ఇంకా తీసుకుంటూనే ఉన్నట్లుగా శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత చెప్పింది. అయితే శాకుంతలం ప్రమోషన్స్ లో నీరసంగా కనిపించిన సమంత ఆ తర్వాత లండన్ లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్స్ అప్పుడు చాలా యాక్టీవ్ గా ఫ్రెష్ గా కనిపించడంతో ఆమె లుక్స్ విషయంలో, బిహేవియర్ విషయంలో చాలా చర్చ నడిచింది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా సింపతీ గేమ్స్ ఆడుతుంది అన్నారు.

అయితే తానింకా మాయోసైటిస్ నుండి కోలుకోలేదు అంటూ మరోసారి సమంత ఆ విషయాన్ని లేవనెత్తింది. తానింకా ఆ వ్యాధికి సంబందించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ప్రస్తుతం హైపర్ బారక్ థెరపీ లో ఉన్నాను, అందులో భాగంగానే ఈ ఆక్సిజెన్ మాస్క్. ఈ చికిత్స లో భాగంగా స్వచ్ఛమైన ఆక్సిజెన్ అందిస్తారు. ఆ ఆక్సిజెన్ ద్వారా ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. 

అంతేకాకుండా దెబ్బతిన్న కణాలు కోలుకునే అవకాశం ఉంది. అదనపు ఆక్సిజెన్ బ్యాక్టీరియాపై పోరాటంలో సహాయపడుతుంది. వ్యాధులనుండి తిరిగికొలుకోవడానికి హెల్ప్ అవుతుంది.. అంటూ తాను ఎందుకు ఆక్సిజెన్ మాస్క్ తగిలించుకుందో చెప్పుకొచ్చింది.

Samantha with oxygen mask:

Samantha With Oxygen Mask In Hospital Photo Viral Details

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ