SSMB28 షూటింగ్ మొదలైనప్పటి నుండి ఏదో జరుగుతుంది అనేలా ఉన్నాయి మహేష్, త్రివిక్రమ్ కదలికలు. సెప్టెంబర్ చివరి వారంలో చేసిన మొదటి షెడ్యూల్ పనికిరాలేదనే టాక్ ఉంది. మహేష్ బాబుకి ఆ మొదటి షెడ్యూల్ రషెస్ నచ్చలేదు, లుక్ విషయంలో అసంతృప్తితో ఉన్నారని ఆ షెడ్యూల్ పక్కనబడేసి జనవరి చివరి నుండి ప్రోపర్ గా ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు త్రివిక్రమ్ అనే న్యూస్ నడిచింది. ఆ తర్వాత రెండు షెడ్యూల్స్ కూల్ గా జరిగిపోయాయి.
ఇప్పుడు కొత్త షెడ్యూల్ మే మొదటి వారంలో మొదలు పెట్టేందుకు నిర్మాతలు చినబాబు, నాగవంశీ రెడీ అయ్యి మహేష్ ని కలవగా.. త్రివిక్రమ్ రెడీగా ఉంటె అయితే నాకు ఓకె అన్న మహేష్ ఓ మూడు రోజులు సమ్మర్ వెకేషన్ కి వెళుతున్నట్టుగా చెప్పడంతో నిర్మాతలు సైలెంట్ అయ్యారట. ఇప్పటికే మహేష్ ఫ్యామిలీతో పారిస్ ట్రిప్ వెళ్లొచ్చారు. అటు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో యాడ్ షూట్ లో బిజీగా మారడంతో మహేష్ కూడా వెకేషన్ అంటూ వెళ్లిపోవడంతో తదుపరి SSMB28 షెడ్యూల్ పై ఇప్పుడు క్లారిటీ లేకుండా పోయింది.
లేదంటే మే మొదటి వారంలో SSMB28 కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది. ఇక ఈ షెడ్యూల్ లో మహేష్ అలాగే కీలక నటులపై కొన్ని సన్నివేశాలను త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.