హీరోయిన్స్, హీరోలని విపరీతంగా అభిమానించే అభిమానులు బోలెడంతమంది ఉంటారు. తమ అభిమాన తారల పుట్టినరోజులకి వారు బ్లడ్ డొనేట్ చెయ్యడం, ఇంకా చాలా మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అయితే కొంతమంది అభిమానులు అభిమానం ఎక్కువైతే గుడులు కడతారు. కోలీవుడ్ లో ఖుష్బూ, హన్సిక లాంటి హీరోయిన్స్ కి అక్కడి అభిమానులు గుడులు కట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత అభిమాని ఒకరు సమంతకి తన ఇంటి ఆవరణలో గుడి కట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కి సమంత అంటే చాలా ఇష్టమట. హీరోయిన్ గా ఆమెను ఎంతో ఆరాధించే సందీప్.. ఆమె చేసే పలు సేవా కార్యక్రమాలకు ఆకర్షిస్తుడై ఏకంగా ఆమెకి గుడి కట్టేసాడు. సమంతకి గుడి కట్టాలనే ఆలోచన రావడమే తరువాయి.. తన ఇంటి ఆవరణలోనే సమంతకి గుడి కట్టి ప్రస్తుతం ఆమె విగ్రహానికి ఫైనల్ టచ్ ఇస్తున్నాడట.
ఇప్పటివరకు సమంతని డైరెక్ట్ గా చూడకపోయినా.. ఆమెని ఆరాధిస్తూ గుడి కట్టినట్లుగా చెప్పిన సందీప్ ఈ గుడిని ఈ నెల 28 అంటే రేపు శుక్రవారం ఓపెనింగ్ చెయ్యబోతున్నట్టుగా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.