కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామిలికి చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో చెన్నై కోర్టులో లింగుస్వామిని ఆయన సోదరుడిని నిందితుడిగా పేర్కొంటూ కోర్టు జైలు శిక్ష విధించగా లింగు స్వామి ఆయన సోదరుడు కింది కోర్టు తీర్పుని మద్రాస్ హై కోర్టులో సవాల్ చెయ్యగా వారికి హైకోర్టులో ఊరట లభించింది. కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది.
అసలు లింగుస్వామికి ఆయన సోదరుడికి చెన్నై కోర్టు శిక్ష ఎందుకు విధించింది అంటే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఓ సినిమా నిర్మాణం కోసం పీవీపీ కేపిటల్స్ కి చెక్ ఇవ్వగా.. సదరు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ కేపిటల్స్ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది.
అయితే లింగుస్వామి ఆయన సోదరుడు కింది కోర్టు తీర్పుని సవాలు చేస్తూ మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించగా వాదనలు విన్న కోర్టు వారి జైలు శిక్షపై స్టే విధించడంతో ప్రస్తుతానికి లింగుస్వామి ఆయన సోదరుడు అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు.