Advertisementt

పొన్నియన్ సెల్వన్ పై కామెడీ

Wed 26th Apr 2023 09:49 PM
ponniyin selvan  పొన్నియన్ సెల్వన్ పై కామెడీ
Comedy on Ponniyin Selvan పొన్నియన్ సెల్వన్ పై కామెడీ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో మణిరత్నం క్రేజీ స్టార్స్ తో తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా గత ఏడాది విడుదలైంది. తమిళంలో హిట్ అయిన ఈ మూవీ మిగతా భాషల్లో సో సో రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 రేపు శుక్రవారం ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో హంగామా చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చూసి అసలు సినిమాలోని కథానాయకుల పేర్లు అర్ధమే కాలేదు.. వాళ్ళ పేర్లు పూర్తిగా తెలుసుకునేలోపే సినిమా అయ్యిపోయింది. 

అర్ధం కానీ తమిళ భాషలో చోళ రాజుల పేర్లను పెట్టడంతో తెలుగు ప్రేక్షకులు ఆ పేర్లకి అలవాటు పడలేదు. అయితే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 థియేటర్స్ లోకి వస్తున్న సమయం దగ్గర పడుతుండడంతో తెలుగు ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ 2 పై కామెడీ చేస్తున్నారు. నాకు అసలు పొన్నియన్ సెల్వన్ 1 లో ఏం జరిగిందో గుర్తులేదు. ఆ రాజుల పేర్లు అస్సలు గుర్తులేదు.. అందుకే అమెజాన్ ప్రైమ్ లో పొన్నియన్ సెల్వన్ సినిమా చూసి మళ్ళీ ఆ పేర్లని మరోసారి చూసుకున్నాను అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పుడు నిజంగానే కామెడీగా అనిపిస్తుంది. ఆల్రెడీ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ కి ముందు అంటే రెండు రోజుల ముందు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ చేస్తామని చెప్పారు. అందుకేనేమో అంటూ సెటేరికల్ గా నెటిజెన్స్ స్పందిస్తున్నారు.

ప్రతి పాత్రని అందంగా ఆకర్షణగా చూపిస్తే సరిపోదు.. ఆ పాత్ర అందరికి కనెక్ట్ కావాలి. కానీ పొన్నియన్ సెల్వన్ 1 తెలుగు ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ కాలేదు. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది అంటే దానిపై క్యూరియాసిటీ కన్నా జనాల్లో ఇలాంటి సెటేరికల్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.

Comedy on Ponniyin Selvan:

Comedy on Ponniyin Selvan part 1

Tags:   PONNIYIN SELVAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ