Advertisementt

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం అందిందా..?

Wed 26th Apr 2023 08:02 PM
ntr,kalyan ram  ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం అందిందా..?
Has NTR-Kalyan Ram received an invitation? ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం అందిందా..?
Advertisement
Ads by CJ

విజయవాడ వేదికగా పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్న ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ ముందుండి నడిపిస్తున్నారు. ఈ వేడుకకి ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం హాజరు కాబోతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, అల్లుళ్ళు, కొడుకులు కోడళ్ళు ఇలా అందరూ రాబోతున్నారు. 

అయితే ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు హాజరవుతారా అనే సందిగ్దత ఇప్పుడు నందమూరి అభిమానుల్లో మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాలయ్య పలకరించరు. సో ఎన్టీఆర్ రాకపోవచ్చు. ఎన్టీఆర్ కి తోడు నీడలా వెన్నంటి ఉండే కళ్యాణ్ రామ్ తమ్ముడు రాకపోతే ఈ ఈవెంట్ కి ఒంటరిగా వెళతారా అసలు ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ఆహ్వానం అందిందా.. ఇపుడు అందరిలో ఇదే ప్రశ్న మొలకెత్తింది.

విజయవాడలో ఏప్రిల్ 28 శుక్రవారం సాయంత్రం జరగనున్న ఈ వేడుకకి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ రాకపోయినా.. హైదరాబాద్ లో జరగబోయే శతజయంతి ఉత్సవాల్లో కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ పాల్గొంటారని తెలుస్తుంది. కానీ ఇప్పుడు వీరు విజయవాడ వస్తారా అనే దానిపై అందరిలో క్యూరియాసిటీ అయితే మొదలైపోయింది.

Has NTR-Kalyan Ram received an invitation?:

NTR Centenary Celebrations at Vjd

Tags:   NTR, KALYAN RAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ