కన్నడలో 16 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమాని ముందుగా ప్యాన్ ఇండియాలోని భాషల్లో విడుదల చెయ్యకుండా రిషబ్ శెట్టి కన్నడలో విడుదల చేసాడు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగానే రెండు వారాల తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ మూవీగా కాంతారని తీసుకొచ్చాడు. కాంతార విడుదలైన ప్రతి భాషలో అద్దిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు.. 400 కోట్లపైమేర కలెక్షన్స్ తీసుకొచ్చింది. కాంతార హిట్ తో రిషబ్ శెట్టి దానికి ప్రీక్వెల్ రెడీ చేసుకుంటున్నాడు.
అయితే ఇప్పుడు విరూపాక్షని కూడా తెలుగులో మాత్రమే విడుదల చేసారు మేకర్స్. అసలు దానిని ప్యాన్ ఇండియాలో విడుదల చేసే ప్లాన్ మేకర్స్ కి లేదు, దర్శకుడికి లేదు. కానీ తెలుగులో విరూపాక్ష సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. దానితో విరూపాక్ష మేకర్స్ ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చెయ్యబోతున్నారు. మే మొదటివారంలో విరూపాక్షని హిందీలో రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
మరి కాంతార కి వర్కౌట్ అయినట్లుగా విరూపాక్ష కూడా వర్కౌట్ అయితే ఓకె.. అవుతుంది అనే చాలామంది నమ్ముతున్నారు. మరి నాని కూడా దసరాని తెలుగులో హిట్ అయ్యాకే తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తే అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చేవి.. ఈ చిత్రాన్ని ఒకేసారి ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల చెయ్యడం వలన వర్కౌట్ అవ్వలేదనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.