మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ విడుదలకు ముందు స్పోర్ట్స్ బైక్ తో రోడ్ యాక్సిడెంట్ కి గురై నెలరోజులు హాస్పిటల్ లో ఉండి.. ఇంట్లోనే రెండు నెలలు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. ఆ యాక్సిడెంట్ కారణంగా సాయి ధరమ్ తేజ్ చేతికి ప్రాక్చర్ అవడమే కాకుండా ఓకల్ కార్డు ఆపరేషన్ వలన మాట కూడా రాలేదు. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ తో సాయి ధరమ్ తేజ్ చాలా హుషారుగా ఉన్నాడు. అయితే తాను రోడ్ యాక్సిడెంట్ కి గురైనప్పుడు తనని అబ్దుల్ అనే వ్యక్తి కాపాడడంటూ సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ప్రమోషన్స్ లో మాట్లాడాడు. తనకి హెల్ప్ చేసిన వ్యక్తిని ఎప్పటికి మర్చిపోను, అతనికి ఏ సహాయం కావాలన్నా నేను చూస్తాను అని చెప్పాడు.
అంతేకాకుండా అబ్దుల్ ని కలిసినట్లు అతనికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టుగా చెప్పాడు. కానీ అబ్దుల్ మాత్రం తాను సాయి ధరమ్ తేజ్ ని కలవలేదని, అతని టీం కూడా తనకి ఫోన్ చెయ్యలేదని అంటున్నాడు. రోడ్ యాక్సిడెంట్ తర్వాత అతన్ని ఫ్యామిలీ మెంబెర్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. తర్వాత నాకు పోలీసుల నుండి కాల్స్ వచ్చాయి కానీ.. ఆయన ఫ్యామిలీ నుండి ఎలాంటి ఫోన్ రాలేదు. కానీ యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి 5 లక్షలు సాయం చేసారు, రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని వస్తున్న వార్తలన్నీ అవాస్తమని, అవన్నీ ఫేక్ వార్తలని.. ఈ ఫేక్ న్యూస్ వలన తాను చాలా నష్టపోయనంటున్నాడు.
సాయి ధరమ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు నేను సీఎంఆర్ లో పనిచేసేవాడని. కానీ ఈ ఫేక్ న్యూస్ ల వల్ల అందరూ వచ్చి నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడగడంతో అవమానంగా అనిపించి జాబ్ మానేశా. ఇప్పుడు అమెజాన్ లో డ్రైవర్ గా చేస్తున్నాను. సాయి ధరమ్ కి యాక్సిడెంట్ అయ్యాక మీడియా, పోలీస్ లు మత్రమే ఫోన్ చేసారు. మెగా ఫ్యామిలీ వారు ఎవరూ కాల్ చెయ్యలేదు. కానీ మా రిలేటివ్స్ మాత్రం నీకు ఎంత డబ్బు ఇచ్చారంటూ ఫోన్స్ చేసి విసిగించారు.
ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఫోన్ చేస్తే వెళ్లి కలుస్తాను. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్పెడ్ చేయకండి. విరూపాక్ష సినిమా నేను చూశాను. చాలా బాగుంది. మెగా ఫ్యామిలీకి నేను కూడా పెద్ద అభిమాని.. వాళ్ళు పిలిస్తే తప్పకుండా వెళ్లి కలుస్తాను అంటూ అబ్దుల్ చెప్పుకొచ్చాడు.