ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత చేసారు. త్రివిక్రమ్ జోనర్ కి డిఫరెంట్ గా తెరకెక్కిన అరవింద సమేత హిట్ అయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలనుకోవడమే కాదు.. అఫీషియల్ గా త్రివిక్రం-ఎన్టీఆర్ కాంబోలో సినిమా అనౌన్సమెంట్ కూడా వచ్చింది. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో వీరి కాంబో మూవీ ఆగిపోయింది అని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన ప్రవేట్ పార్టీలో త్రివిక్రం కనిపించగానే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ఉంది.. అది ఆగిపోలేదంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.
తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం #NTR30 షూటింగ్ లో ఎన్టీఆర్, #SSMB29 షూట్ లో త్రివిక్రమ్ ఉన్న సమయంలో వీరి కలయికలో మూవీ ఎలా సాధ్యం, సెట్స్ మీదకి వెళ్లడం అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారమేమో.. అయితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సెట్స్ మీదకెళ్ళేది ఓ యాడ్ షూట్ కోసమే. రేపటినుండి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి యాడ్ షూట్ కి చేయబోతున్నారట.. అదన్నమాట అసలు విషయం.