ఈమధ్యన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పాలిటిక్స్ ని మీడియా ముందు ఎక్స్పోజ్ చేసింది. బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేకే తాను అమెరికా వెళ్లినట్లుగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా సౌత్ హీరోయిన్ భూమిక కూడా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని చాలామంది దర్శకనిర్మాతలు సైన్ చేసిన సినిమాల నుండి తప్పించారని, లేదంటే తన కెరీర్ హిందీలో మరో విధంగా ఉండేది అంటూ భూమిక చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
రీసెంట్ గా భూమిక సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో కీ రోల్ పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భూమిక మట్లాడుతూ తనకి బాలీవుడ్ లో తేరే నామ్ చిత్రంతో ఎంట్రీ లభించింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం హిట్ కావడంతో నాకు బోలెడన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగానే ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం నాకు ఆఫర్ రాగా.. నేను అది ఓకె చేశాను. కానీ దానికి ప్రొడ్యూసర్స్ మారడంతో నన్నే కాదు, ఆఖరికి హీరోని కూడా మార్చేసి సినిమా టైటిల్ కూడా మార్చేసి మరీ సినిమా చేసుకున్నారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే నా కెరీర్ బాలీవుడ్ లో మరోలా ఉండేది. ఆ సినిమా కోసం ఏడాది సమయం వృధా అయ్యింది. తర్వాత వేరే సినిమా చేశాను. కానీ నాకు తేరే నామ్ వంటి పెద్ద హిట్ హిందీలో పడలేదు.
ఇక బాలీవుడ్ లో నన్ను మరో ఘటన వేధించింది. అదేమిటంటే జబ్ వి మెట్ సినిమాకి హీరోయిన్ గా నేను సైన్ చేశాను. హీరోగా బాబీ డియోల్ అన్నారు. తర్వాత షాహిద్ కపూర్ అన్నారు. కానీ చివరికి షాహిద్ కపూర్-కరీనా కపూర్ తో సినిమా మొదలైంది. నన్ను కూడా ఈప్రాజెక్టు నుండి తప్పించారు. మున్నా భాయ్ ఎంబిబిఎస్ కి కూడా సంతకాలం చేశాను. దానినుండి కూడా నన్ను తప్పించారు. మణిరత్నం మూవీలోనూ నేనే హీరోయిన్ అన్నారు. చివరికి హ్యాండిచ్చారు. అంటూ బాలీవుడ్ లో తన కెరీర్ ఎలా ఎండ్ అయ్యిందో భూమిక చెప్పుకొచ్చింది.