Advertisementt

ఇస్మార్ట్ కి సీక్వెల్ గ్యారెంటీ

Tue 25th Apr 2023 03:45 PM
puri,ramto  ఇస్మార్ట్ కి సీక్వెల్ గ్యారెంటీ
Puri Jagannath-Ram project to get going ఇస్మార్ట్ కి సీక్వెల్ గ్యారెంటీ
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మాస్ మసాలా సెన్సేషనల్ హిట్ అయ్యింది. రామ్ ని మాస్ గా ప్రెజెంట్ చేసిన పూరి జగన్నాథ్ ఈ చిత్రంతోనే ఒడ్డున పడ్డాడు. పూరి, ఛార్మి ఇద్దరూ నిర్మాతలుగా కోట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు మరోసారి రామ్-పూరి కాంబో సెట్స్ మీదకి వెళ్లనుంది అనే న్యూస్ రామ్ అభిమానులని నిలువనియ్యడం లేదు. వీరి కాంబోలో మళ్ళీ మాస్ మూవీనే రాబోతోందా.. అసలు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ చేస్తారా.. లేదంటే లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారా అనే ఆరాటం చాలామందిలో కనిపిస్తుంది.

అయితే తాజాగా పూరి జగన్నాథ్-రామ్ ఇద్దరూ కొత్త జోనర్ లో మూవీ చెయ్యడం లేదంట.. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇస్మార్ట్ శంకర్ కి పార్ట్ 2 నే చేస్తే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారట. అటు రామ్ ప్రస్తుతం బోయపాటి తో #BoyapatiRapo ఫ్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రం అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పూరి లైగర్ ప్లాప్ నుండి కోలుకుని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ స్టోరీపై కూర్చున్నారట.

రామ్ ముంబై వెళ్ళినప్పుడు పూరి తో మీట్ అయ్యాడని అంటున్నారు. సో ఈ కాంబోపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.

Puri Jagannath-Ram project to get going:

Puri-Ramto make a headstart

Tags:   PURI, RAMTO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ