Advertisementt

మంగుళూరులో ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే

Tue 25th Apr 2023 02:01 PM
pooja hegde,mangalore  మంగుళూరులో ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే
Pooja Hegde enjoying in Mangalore మంగుళూరులో ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే కి ప్రస్తుతం టైం బాగోలేదు. వరస ప్లాప్స్ ఆమెని వెంటాడుతున్నాయి. అయినా పూజ హెగ్డే ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లాప్ వస్తే లైఫ్ ఆగిపోదుగా అంటూ సోషల్ మీడియాలో గ్లామర్ గా సందడి చేస్తుంది. గత ఏడాది నాలుగు భారీ డిసాస్టర్ నుంచి తేరుకుని సల్మాన్ ఖాన్ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. కానీ సల్మాన్ ఖాన్ కూడా పూజ హెగ్డే కి అదృష్టాన్ని ఇవ్వలేకపోయాడు. సల్మాన్ ఖాన్-పూజ హెగ్డే నటించిన కిసి కా భాయ్ కిసి కా జాన్ రీసెంట్ గా విడుదలై ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది. 

మూడు రోజుల్లోనే భాయిజాన్ కథ ముగిసిపోయింది. కిసి కా భాయ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే చాలా అందంగా, ఆకర్షణగా, గ్లామర్ గా అదరగొట్టేసింది. బుట్టబొమ్మకి ఖచ్చితంగా హిట్ పడుద్ది అనుకున్నారు. కానీ పూజ హెగ్డేని ఆ సినిమా కూడా కాపాడలేకపోయింది. ప్రస్తుతం పూజ హెగ్డే ఆ ప్లాప్ టాక్ నుండి కాస్త రిలాక్స్ అవడానికి మంగళూరు వెళ్ళింది. అక్కడ ట్రెడిషనల్ గా మారిపోయి మంగళూరు ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. 

చుడిదార్ లో, కొప్పులో మల్లెపూలతో, చేతిలో పువ్వు తో పూజ హెగ్డే ఈసారి గ్లామర్ గా కాకూండా దేవతలా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే మంగళూరు ట్రిప్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Pooja Hegde enjoying in Mangalore:

Pooja Hegde In Mangalore

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ