ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ అలియా భట్ పెళ్లి, పిల్లలు తర్వాత ఏ మాత్రం తగ్గడం లేదు. జిమ్ లో వర్కౌట్స్ తో బరువు తగ్గించేసి యాధస్థితికి వచ్చేసిన అలియా భట్ మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటుంది. అలాగే ఈవెంట్స్, అవార్డు వేడుకల్లో గ్లామర్ గా హడావిడి మొదలుపెట్టింది. ఆర్.ఆర్.ఆర్ తో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా మారిన అలియా భట్ బాలీవుడ్ లో టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా అలియా భట్ ముంబైలో రెండిళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు మరో ఇల్లు కొనుగోలు చేసింది.
ముంబైలో కాస్ట్లీ ఏరియాలో 37 కోట్లతో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే రణబీర్ కపూర్ తో పెద్దింట్లో కాపురం పెట్టిన అలియా భట్ మళ్ళీ ఈ ఇల్లు కొనింది. భర్త, బిడ్డతో పాటుగా అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కాదు.. ఆ ఇంట్లో అలియా భట్ తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టనుంది. అంటే సినిమాల్లో హీరోయిన్ గానే కాదు.. అటు నిర్మాతగానూ అలియా భట్ సత్తా చాటడానికి రెడీ అవ్వబోతుందట. అందుకే ముంబైలో అంత పెద్దిల్లు కొనేసిందట,
ప్రస్తుతం అలియా భట్ ముంబైలోని బాంద్రా ఏరియా కొన్న కాస్ట్లీ ఇల్లు గురించిన వార్తలే బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్ మూవీస్ మాత్రమే కాకుండా.. టాలీవుడ్ లో తెరకెక్కే ఫ్యాన్ ఇండియా మూవీస్ పై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.