Advertisementt

సలార్ లో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట

Mon 24th Apr 2023 09:16 PM
salaar,rpabhas  సలార్ లో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట
Major highlight of Salaar సలార్ లో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట
Advertisement
Ads by CJ

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉందనే న్యూస్ తో ప్రభాస్ ఫాన్స్ చాలా క్యూరియాసిటీతో ఆసక్తితో ఉన్నారు. ఈ నెల చివరి కల్లా సలార్ షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మే మొదటి వారంలో సలార్ నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ కి మేకర్స్ ప్లాన్ చేసారని అంటున్నారు. అయితే సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దాదాపుగా ఎనిమిదిమంది విలన్స్ కనిపించబోతున్నారట.

మెయిన్ విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. జగపతి బాబు లాంటి వారు పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తారని టాక్. అయితే సలార్ సినిమా క్లైమాక్స్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది సలార్ క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి ఓ ట్విస్ట్ రివీల్ అవ్వగా.. అసలు ఆ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సెకండ్ క్యారెక్టర్ కి సంబంధించి రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ అదిరిపోతుంది అంటూ వస్తున్న వార్తలతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రభాస్ లుక్ ని పవర్ ఫుల్ మాస్ అవతార్ లో డిజైన్ చేసాడని, ప్రభాస్ కెరీర్ లో సలార్ మాస్ యాక్షన్ మూవీగా మిగిలిపోతుంది అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ సలార్ లో మెయిన్ హైలెట్ అంటూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.

Major highlight of Salaar:

Crazy news on Salaar

Tags:   SALAAR, RPABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ