Advertisementt

నిజంగా ఫాన్స్ పిచ్చోళ్లే

Mon 24th Apr 2023 08:09 PM
ram charan,allu arjun  నిజంగా ఫాన్స్ పిచ్చోళ్లే
Fans are really crazy నిజంగా ఫాన్స్ పిచ్చోళ్లే
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ vs అల్లు ఫ్యామిలీ అని ఎప్పటినుండో టాక్ ఉంది. మెగా-అల్లు ఫామిలీస్ రెండూ ఎవరి ఎదుగుదలకి వారు డిజైన్ చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫాన్స్ అనే ట్యాగ్ ని వదిలించుకుని అల్లు ఆర్మీ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే న్యూస్ ఎప్పటినుండో చక్కర్లు కొడుతోంది. అలాగే రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్యన విపరీతమైన పోటీ ఏర్పడింది. పుష్పతో ఆలు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ తెచ్చుకుంటే.. రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. 

ఎవరికి వారే తమ క్రేజ్ ని పెంచుకుంటుంటే.. వీరి మధ్యలో కోల్డ్ వార్ ఉంది అంటూ మీడియా కోడై కూస్తుంది. చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ ట్వీట్ చెయ్యకపోవడం, పార్టీకి రాకపోవడంపై మెగా ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. అల్లు అర్జున్ అర్జున్ బర్త్ డే కి రామ్ చరణ్ వెకేషన్ కి వెళ్ళాడు. సో వీళ్ళమధ్యన ఏదో ఉంది అనేది ఈ రకంగా తేటతెల్లమైంది అన్నారు. అయితే వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. బయటికి కనిపించేది నిజమో.. కాదో అర్ధం కాదు.. కానీ కొన్ని విషయాల్లో కనిపించేవి నిజాలని నమ్మి దానికే ఫిక్స్ అవుతూ ఉంటారు కొందరు.

మరి మీడియా, ఫాన్స్ నిజంగా పిచ్చోళ్ళు కాకపోతే.. వాళ్ళ మధ్యన కోల్డ్ వార్ ఉంటే అది మీడియాకి పబ్లిక్ గా చూపిస్తారా.. ఒకవేళ వారి మధ్యన పోటీ, అలాగే ఈగో ఫీలింగ్స్ ఉంటే.. చరణ్ వైఫ్ ఉపాసన బేబీ షవర్ పార్టీకి అల్లు అర్జున్ హాజరై సరదాగా మైక్ తో కనిపించడు కదా.. నిజంగా ఫాన్స్ పిచ్చోళ్లే. మీడియా ఏదో చూపిస్తే అది నమ్మి తిట్టేసుకోవడమేమిటో అర్ధం కాదు. రాత్రి ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్-రామ్, చరణ్ ఎంత సరదాగా ఉన్నారో  ఓ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది అది చూడండి.. 

ఇప్పుడు చరణ్-బన్నీ ఒకే వేదికలో కనిపించడంతో వారి మధ్యన ఎలాంటి గొడవ లేదు, వారు సఖ్యతగానే ఉన్నారు.. ఎవరో గిట్టని వాళ్ళు సృష్టించే రూమర్స్ నమ్మొద్దు, మబ్బులు విడిపోయాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Fans are really crazy:

Ram Charan vs Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ