రష్మిక మందన్న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మోగిపోతున్న పేరు. తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరిన రశ్మికకి ఇప్పటివరకు తమిళ, హిందీ భాషల్లో హిట్ అందలేదు. వారిసులో విజయ్ తో కలిసి నటిస్తే ఆ సినిమా సో సో గా ఆడడం అటుంచి రష్మిక మందన్న స్కోప్ లేని కేరెక్టర్ తో వెల వెల బోయింది. బాలీవుడ్ లో నటించిన రెండు చిత్రాలు రశ్మికకి సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2, యానిమల్ హిందీ ప్రాజెక్ట్ తో పాటుగా నితిన్ తో ఓ మూవీ, తెలుగు, తమిళ్ బైలింగువల్ రైన్ బో వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది.
అయితే సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగాను, ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాను. ఇప్పటికే చాలా అవార్డులు అందుకున్నాను. కానీ నా ఎదుగుదల, నా గొప్పదనం చూసి మా పేరెంట్స్ గర్వించడం లేదు. కారణం సినిమా రంగంపై వారికి ఎలాంటి అవగాహనా లేకపోవడమే. సినిమాల గురించి, నా పని గురించి వారికి ఏమి తెలియదు. అసలు నేనేం చేస్తున్నానో అనేది నా తల్లితండ్రులకి అర్ధం కాని పరిస్థితి అంటూ రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నా పని గురించి వాళ్ళకి తెలియకపోయినా.. వారి పూర్తి సహకారం నాకు ఉంటుంది, నా గురించి వాళ్ళు చాలా శ్రద్ద తీసుకుంటారు, తనకేం కావాలన్నా చేస్తారు అని చెప్పిన రష్మిక.. తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు తన వలన పేరెంట్స్ ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నారు, వారు పడ్డ కష్టాలు తనకి తెలుసు, అందుకే నా పేరెంట్స్ గర్వపడేందుకు తానింకా సాధించాల్సింది చాలా ఉంది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.