Advertisementt

ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ లో బన్నీ సందడి

Mon 24th Apr 2023 12:38 PM
allu arjun,upasana  ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ లో బన్నీ సందడి
Allu Arjun Attended Upasana Baby Shower ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ లో బన్నీ సందడి
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన దంపతులు పదేళ్ల తర్వాత తల్లితండ్రులు కాబోతుండడం వారి ఫ్యామిలోకే కాదు ఫ్రెండ్స్ కి కూడా చాలా సంతోషాన్నిచ్చింది. మెగా ఫ్యామిలీతో పాటుగా కామినేని ఫ్యామిలీ కూడా ఉపాసన ప్రెగ్నెంట్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. మరో రెండు నెలల్లో ఉపాసన చేతిలో మెగా వారసుడు ఉండబోతున్నాడు. ప్రస్తుతం ఉపాసన భర్త రామ్ చరణ్ తో వెకేషన్స్, అలాగే బిజినెస్ పనులని చక్కబెట్టుకుంటూనే బేబీ షవర్ ఫంక్షన్స్ ని ఎంజాయ్ చేస్తుంది.

దుబాయ్ లో ఉపాసనకు ఆమె సిస్టర్ అనుష్పాల మరో కజిన్ సిస్టర్ కలిసి అదిరిపోయేలా ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించారు. అక్కడే చరణ్-ఉపాసన ఇద్దరూ కలిసి ఆ వేడుకని ఎంజాయ్ చేసారు. ఇక గత వారం ఉపాసనకు మెగా ఫ్యామిలీ శ్రీమంతం వేడుకని ఘనంగా నిర్వహించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఉపాసన ఫ్రెండ్స్ కూడా ఉపాసనకు బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించారు.

నిన్న ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఉపాసన స్నేహితురాలు సునీత రెడ్డి ఉపాసనకు శ్రీమంతం వేడుకని స్పెషల్ గా నిర్వహించారు. ఈవేడుకలో మంచు లక్ష్మి, రామ్ చరణ్ తో పాటుగా అల్లు అర్జున్ ఇంకాకొందరు సెలబ్రిటీస్ సందడి చెయ్యడమే కాకుండా.. ఉపాసనకు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్ తెలియజేసిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Allu Arjun Attended Upasana Baby Shower :

Allu Arjun Wishes To Charan & Upasana

Tags:   ALLU ARJUN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ