ఈ శుక్రవారం రిలీజ్ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్షకి పాజిటివ్ టాక్ రావడం, సెలబ్రిటీస్ విరూపాక్షపై వేస్తున్న ట్వీట్స్ తో మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా విరూపాక్షని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోను వేసవి సెలవలు స్టార్ట్ అవడం.. రంజాన్ వీకెండ్ కూడా విరూపాక్షకి కలిసొచ్చింది. అయితే అనుకున్న సమయానికి విరూపాక్ష షో వెయ్యలేదని సాయి తేజ్ ఫాన్స్ థియేటర్ పై దాడి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్ లోని మూసాపేట్ లక్ష్మి కళ థియేటర్ లో విరూపాక్ష మూవీ చూసేందుకు ఆదివారం కూడా కావడంతో ప్రేక్షకులు భారీ ఎత్తున చేరుకున్నారు. షో టైం కి వారు థియేటర్ లోపలికి వెళ్లి కూర్చున్నారు. కానీ సమయానికి షో మొదలు పెట్టలేదు థియేటర్ యాజమాన్యం. దానితో చిర్రెత్తుకొచ్చిన సాయి తేజ్ అభినులు థియేటర్ పై దాడి కి తెగబడ్డారు. కూర్చులు విరగ్గొట్టి, థియేటర్ అద్దాలను ధ్వంశం చేసెయ్యడంతో పోలీస్ లు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
పోలీసులు వచ్చి అక్కడి ప్రేక్షకులకి సర్ది చెప్పడమే కాకుండా థియేటర్ యాజమాన్యం కూడా టికెట్స్ కొన్నవారికి డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చెయ్యడంతో కొంతమంది ప్రేక్షకులు కామ్ గా అక్కడినుండి వెళ్లిపోగా.. మరికొంతమంది టికెట్ డబ్బుల్లో సగమే ఇచ్చారు, పార్కింగ్ ఫీజ్, జీఎస్టీ అంటూ టికెట్ లో సగం డబ్బు ఇవ్వడంపై సోషల్ మీడియాలో మూసాపేట్ లక్ష్మి కళ థియేటర్ యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు.