ప్యాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ 1 పొజిషన్ కి ప్రభాస్ చేరడానికి కారణం రాజమౌళితో ఆయన చేసిన బాహుబలి చిత్రమే. బాహుబలి రెండు పార్ట్ లతో ప్యాన్ ఇండియా మర్కెట్ ని రూల్ చేసిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలని కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఇంకా ప్రసాద్ లు భారీ బడ్జెట్ తో బాహుబలిని నిర్మించారు. అయితే బాహుబలి పార్ట్ 1, పార్ట్2 తర్వాత పార్ట్ 3 పై అందరిలో ఎంతో ఉత్సుకత కనిపించడమే కాదు.. రాజమౌళి, ప్రభాస్, నిర్మాతలు కూడా బాహుబలి సీరీస్ ఉంటుంది అని కన్ ఫర్మ్ చేసినా ఇప్పటివరకు పార్ట్ 3 పై ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
ప్రభాస్ పలు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండగా.. రాజమౌళి అటు మహేష్ తో చెయ్యబోయే సినిమా విషయంలో బిజీ కాబోతున్నారు. అయితే తాజాగా ప్రభాస్- బాహుబలి నిర్మాతలు కలవడం హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి-3పై చర్చించేందుకే ప్రభాస్ ఆ నిర్మాతలను కలిసి ఉంటాడని ఫిల్మ్ సర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతున్న వార్త. మరి నిజంగానే ప్రభాస్ బాహుబలి 3 కోసమే ఆ నిర్మాతలని కలిసారా అనేది ఇప్పుడు హాట్ హాట్ గా చాక్కర్లు కొడుతున్న న్యూస్.
లేదంటే ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ విషయమై వాళ్ళని కలిసారా.. బాహుబలి హడావిడి ముగిసాక పెద్దగా కలవని ప్రభాస్-బాహుబలి నిర్మాతలు ఇప్పుడు సడన్ గా కలవడంపై అందరిలో క్యూరియాసిటీ కనిపిస్తుంది. అసలు విషయం ఏమై ఉంటుందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు కొందరు.