Advertisementt

మహేష్ SSMB28 సెట్స్ లోకి వెళ్ళేది అప్పుడే

Sat 22nd Apr 2023 01:59 PM
mahesh babu,ssmb28  మహేష్ SSMB28 సెట్స్ లోకి వెళ్ళేది అప్పుడే
SSMb28 shooting update మహేష్ SSMB28 సెట్స్ లోకి వెళ్ళేది అప్పుడే
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం ఇంకా పారిస్ లో తన ఫ్యామిలీ ట్రిప్ లోనే ఉన్నారు. SSMB28 రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన మహేష్ బాబు.. ఫ్యామిలీ ట్రిప్ తో పాటుగా అయన పారిస్ లో ఏదో ట్రీట్మెంట్ లో ఉన్నారనే టాక్ కూడా ఉంది. అయితే పారిస్ నుండి మహేష్ రాగానే మే మొదటి వారంలో SSMB28 తదుపరి షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లోనే పూజా హెగ్డే-శ్రీలీల లు జాయిన్ అవుతారని సమాచారం.

ఇప్పటికే SSMB28 ఫస్ట్ లుక్ లో మహేష్ మాస్ అవతార్ మహేష్ ఫాన్స్ కి కునుకు రానివ్వడం లేదు. మరోపక్క మే 31 కృష్ణగారి జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ తో పాటుగా స్పెషల్ గ్లిమ్ప్స్ వదిలేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట, నిర్మాత నాగ వంశీ మహేష్ ఫాన్స్ కి చెప్పేసాడు. మళ్ళీ మే 31 వరకు SSMB28 నుండి అప్ డేట్ ఉండదు.. ఆ రోజే మీకు ట్రీట్ ఇస్తామని.

SSMB28 వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో తేదీ ప్రకటించారు. ప్రభాస్ ప్రాజెక్ట్ K తో పోటీకి మహేష్ సై అంటున్నాడు. దానితో సంక్రాంతి ఫైట్ ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది.

SSMb28 shooting update:

Mahesh Babu SSMB28 update 

Tags:   MAHESH BABU, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ