Advertisementt

సీనియర్ యాక్టర్ శరత్ బాబు హెల్త్ అప్ డేట్

Sat 22nd Apr 2023 12:54 PM
sarath babu  సీనియర్ యాక్టర్ శరత్ బాబు హెల్త్ అప్ డేట్
Senior Actor Sarath Babu Health Update సీనియర్ యాక్టర్ శరత్ బాబు హెల్త్ అప్ డేట్
Advertisement
Ads by CJ

సీనియర్ యాక్టర్ శరత్ బాబు హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్నేళ్ల ముందు వరకు సినిమాల్లో కనిపించేవారు. కానీ కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న శరత్ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే కానీ.. ఆయన హెల్త్ పై సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా శరత్ బాబు పై హెల్త్ అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.

నిన్న శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్ గా మారగా ఆయన్ని ఫ్యామిలీ మెంబెర్స్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడం జరిగిందట. హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రి ఏఐజి లో ఆయన్ని జాయిన్ చెయ్యగా డాక్టర్స్ బృందం ఆయనకి ఐసియూలో అడ్మిట్ చేసి చికిత్స అందించినట్లుగా సమాచారం. చికిత్స అనంతరం ఇపుడు ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుట పడడంతో ఆయన్ని ఈరోజు శనివారం ఉదయం ఐసియూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుత శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే శరత్ బాబు అనారోగ్యం పై కుటుంబ సభ్యులు కానీ డాక్టర్స్ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

Senior Actor Sarath Babu Health Update:

Senior Actor Sarath Babu Hospitalized suddenly

Tags:   SARATH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ